క్రీడాభూమి

లోధా కమిటీ సిఫార్సులు అమలు చేయిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 1: లోధా కమిటీ చేసిన సిఫార్సులను తప్పక అమలు చేయిస్తామని, ఈ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా, తమ పనిని తాము చేసుకుపోతామని సుప్రీం కోర్టు నియమించిన పాలనాధికారుల బృందం (సిఒఎ) చీఫ్ వినోద్ రాయ్ స్పష్టం చేశాడు. సిఫార్సులను అమలును సాధ్యమైనంత వరకూ ఆలస్యం చేయడానికి బిసిసిఐ ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నది. ఇటీవల జరిగిన ఎజిఎంలోనూ ఇదే వ్యూహాన్ని అనుసరించింది. లోధా సిఫార్సుల అమలులో లోటుపాట్లను పరిశీలించే పేరుతో ఎనిమిది మంది సభ్యులతో కూడిన కమిటీని వేసింది. ఈ కమిటీ అధ్యయనం చేసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని బిసిసిఐ ప్రకటించింది. ఇలావుంటే, లోధా సిఫార్సులను అమలు చేసి తీరాల్సిందేనని సుప్రీం కోర్టు ఆదేశించినప్పటికీ, ఆ పనిని సిఒఎ పూర్తి చేయలేకపోతున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ బృందంలోని సభ్యుడు రామచంద్ర గుహ రాజీనామా చేశాడు. మరో సభ్యుడు విక్రం లిమాయే ఈనెల 14న వైదొలగనున్నాడు. ఈ పరిస్థితుల్లో సాధ్యమైనంత త్వరగా లోధా సిఫార్సులు అమలయ్యేలా చూడాలని సిఒఎ చీఫ్ వినోద్ రాయ్ అనుకుంటున్నాడు. ఈ విషయంపై అతను పిటిఐతో మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి, లోధా సిఫార్సులు అమలయ్యేలా చూస్తామన్నాడు. బిసిసిఐ సమావేశంలో ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించినా, ఆమోదించకపోయినా తమ నిర్ణయంలో మార్పులేదని స్పష్టం చేశాడు.