క్రీడాభూమి

నమ్మకం కోల్పోలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్త్ సౌండ్: పరిమిత ఓవర్ల ఫార్మాట్స్‌లోనూ రాణిస్తానన్న నమ్మకాన్ని తాను ఎన్నడూ కోల్పోలేదని విండీస్‌తో జరిన మూడో టెస్టులో 72 పరుగులు సాధించిన భారత ఓపెనర్ అజింక్య రహానే అన్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత అతను మాట్లాడుతూ వనే్డల్లో రాణించలేననిగానీ, టీమిండియాకు ఆడే అవకాశం దక్కదనిగానీ తాను ఎన్నడూ అనుమానించలేదని స్పష్టం చేశాడు. నిలకడగా మంచి స్కోర్లు సాధించడం కీలకమని, ఏ ఫార్మాట్‌లోనైనా జట్టుకు అండగా నిలవగలనన్న నమ్మకంతోనే ఉన్నానని చెప్పాడు. విండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 62, 103, 72 పరుగులు చేసిన అతను వనే్డ ఫార్మాట్‌లోనూ సత్తా చాటాడు. నిన్న మొన్నటి వరకూ అతనిపై ‘టెస్టు క్రికెటర్’ అనే ముద్ర ఉండేది. ఈ సిరీస్‌లో చక్కటి ఆటతో అతను అందరినీ ఆకట్టుకుంటున్నాడు. నిలకడగా ఆడుతూ, అన్ని ఫార్మాట్స్‌లోనూ పరుగులు రాబట్టగల శక్తిసామర్థ్యాలు తనలో ఉన్నాయని నిరూపిస్తున్నాడు. కాగా, ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, బ్యాట్స్‌మెన్‌కు పిచ్ ఏమాత్రం అనుకూలంగా లేకపోవడంతో, ఆరంభంలో ఆచితూచి ఆడాల్సి వచ్చిందని చెప్పాడు. వికెట్లు కూలకుండా జాగ్రత్త పడుతూనే, అవకాశం వచ్చినప్పుడు పరుగులు రాబట్టడమే వ్యూహంగా ఎంచుకున్నామని తెలిపాడు. విండీస్‌పై వరుసగా రెండో విజయాన్ని సమష్టి కృషి ఫలితంగా రహానే అభివర్ణించాడు. మిగతా రెండు వనే్డల్లోనూ ఇదే రీతిలో ఆడతామని ధీమా వ్యక్తం చేశాడు.