క్రీడాభూమి

‘పాత వైన్’ను నేను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్త్ సౌండ్: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తనను తాను ‘పాత వైన్’తో పోల్చుకున్నాడు. ఎంత పాతబడితే అంత ఎక్కువ రుచికరంగా ఉండే లక్షణం వైన్‌కు ఉంది. తనలోనూ అలాంటి లక్షణమే ఉందంటూ, మీదపడుతున్న తన వయసును ఉద్దేశించి చమత్కరించాడు. వెస్టిండీస్‌తో జరిగిన మూడో వనే్డలో 79 బంతులు ఎదుర్కొని అజేయంగా 78 పరుగులు సాధించి, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న అతను మాట్లాడుతూ టాప్ ఆర్డర్ గొప్పగా రాణించడం వల్ల మిడిల్ ఆర్డర్‌కు స్వేచ్ఛగా ఆడే అవకాశం దక్కుతున్నదని చెప్పాడు. ఈనెలలోనే 36 ఏళ్లు పూర్తి చేసుకొని 37వ ఏట అడుగుపెట్టనున్న ధోనీకి ఓ విలేఖరి వయసను గుర్తుచేశాడు. వయసు పెరుగుతున్నప్పటికీ ఇంత బాగా ఎలా రాణిస్తున్నారని ప్రశ్నించాడు. ధోనీ వెంటనే స్పందిస్తూ ‘వైన్ మాదిరిగానే’ అని వ్యాఖ్యానించాడు. టీమిండియా విజయంలో బౌలర్లు కూడా కీలక పాత్ర పోషించారని అన్నాడు. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అశ్విన్ బౌలింగ్ చేస్తున్నప్పుడు ధోనీ వారికి పదేపదే సూచనలు చేశాడు. స్టంప్స్‌లోని మైక్రో ఫోన్ ద్వారా అతని మాటలు అందరికీ వినిపించాయి. దీనిపై అడిగిన ఒక ప్రశ్నకు అతను సమాధానమిస్తూ, బంతులను ఏ దిశగా వేయాలో స్పిన్నర్లకు సూచించడం అత్యవసరమని అన్నాడు. కుల్దీప్ ఐపిఎల్‌లో మ్యాచ్‌లు ఆడినప్పటికీ, అంతర్జాతీయ క్రికెట్‌లోకి కొత్తగా ఆడుగుపెట్టాడని చెప్పాడు. ఎక్కువ మ్యాచ్‌లు ఆడుతున్న కొద్దీ అతనికి అనుభవం వస్తుందని అన్నాడు.