క్రీడాభూమి

సిరీస్‌పై కనే్నసిన టీమిండియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్త్ సౌండ్ (అంటిగువా), జూలై 1: వెస్టిండీస్‌తో జరిగిన మూడో వనే్డను 93 పరుగుల తేడాతో కైవసం చేసుకున్న విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఆదివారం జరిగే నాలుగో మ్యాచ్‌ని కూడా గెల్చుకోవడం ద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది. ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దుకాగా, రెండో మ్యాచ్‌లో 105 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. మూడో వనే్డలో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ అజింక్య రహానే, మహేంద్ర సింగ్ ధోనీ, అర్ధ శతకాలతో రాణించడంతో 50 ఓవర్లలో నాలుగు వికెట్లకు 251 పరుగులు చేయగలిగింది. రహానే 112 బంతులు
ఎదుర్కొని, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 72
పరుగులు చేశాడు. ధోనీ 79 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 78 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కేదార్ జాదవ్ 26 బంతుల్లోనే 40 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. విండీస్ తరఫున మిగుల్ కమిన్స్ రెండు వికెట్లు పడగొట్టాడు. జాసన్ హోల్డర్, దేవేంద్ర బిషూ చెరొక వికెట్ సాధించారు.
భారత్‌ను ఓడించి, సిరీస్‌లో గట్టిపోటీని ఇవ్వడానికి 252 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించాల్సిన వెస్టిండీస్ ఏ దశలోనూ రాణించలేకపోయింది. పేలవమైన బ్యాటింగ్ కారణంగా 38.1 ఓవర్లలో 158 పరుగులకే కుప్పకూలింది. జాసన్ మహమ్మద్ 40 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడంటే, మిగతా బ్యాట్స్‌మెన్ ఏ స్థాయిలో విఫలమయ్యారో ఊహించుకోవచ్చు. రోమన్ పావెల్ 30, షాయ్ హోప్ 24, అతని సోదరుడు కేల్ హోప్ 19 పరుగులతో రెండంకె స్కోర్లు చేయగలిగారు. యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, సీనియర్ అశ్విన్ చెరి మూడు వికెట్లు పడగొట్టి, వెస్టిండీస్‌ను కట్టడి చేశారు. హార్దిక్ పాండ్య రెండు వికెట్లు కూల్చగా, ఉమేష్ యాదవ్, కేదార్ జాదవ్ చెరొక వికెట్ సాధించారు.
మార్పులు ఉంటాయి: కోహ్లీ
కొన్ని మార్పులతో నాలుగో వనే్డలో ఆడతామని భారత కెప్టెన్ కోహ్లీ అన్నాడు. రెండో వనే్డ ముగిసిన తర్వాత కూడా అతను ఇలాంటి ప్రకటననే చేయడం గమనార్హం. కానీ, ఎలాంటి మార్పులు చేయలేదు. మూడో వనే్డలో విజయం సాధించి, సిరీస్‌పై 2-0 ఆధిక్యాన్ని సంపాదించిన తర్వాత అతను విలేఖరులతో మాట్లాడుతూ నాలుగో వనే్డలో కొన్ని మార్పులు చేస్తామని ప్రకటించడం గమనార్హం. ఈ సిరీస్‌లో యువ వికెట్‌కీపర్ రిషభ్ పంత్, దినేష్ కార్తీక్, మహమ్మద్ షమీలకు ఒక్క మ్యాచ్‌ని కూడా ఆడే అవకాశం దక్కలేదు. ఈ విషయాన్ని అతను ప్రస్తావిస్తూ, మిగతా రెండు వనే్డల్లో కొన్ని మార్పులు ఉంటాయని స్పష్టం చేశాడు. అయితే, ఎవరికి అవకాశం దక్కుతుంది? ఎవరికి శ్రాంతినిస్తారు? అన్న ప్రశ్నలపై అతను స్పష్టత ఇవ్వలేదు.