క్రీడాభూమి

బిస్త్ స్పిన్ మాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెర్బీ, జూలై 2: మహిళల ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో భారత్ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లపై తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచిన మిథాలీ రాజ్ నేతృత్వంలోని భారత్ ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను 95 పరుగుల తేడాతో చిత్తుచేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఈ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లకు 169 పరుగులు మాత్రమే చేయగలిగింది. కానీ, ఈ సాధారణ లక్ష్యాన్ని ఛేదించే అవకాశం పాకిస్తాన్‌కు ఇవ్వలేదు. ఏక్తా బిస్త్ ఐదు వికెట్లు పడగొట్టి, పాక్‌ను 38.1 ఓవర్లలో 74 పరుగులకే కట్టడి చేసింది. ఆమె ప్రతిభే భారత్‌కు విజయాన్ని అందించింది. భారత్ ఇన్నింగ్స్‌లో పూనమ్ రావత్ (47), సుష్మా వర్మ (33), దీప్తీ శర్మ (28) కొంత వరకు రాణించారు. పాక్ బౌలర్ నస్రా సంధూ 26 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టగా, సైదా యూసుఫ్ 30 పరుగులకు రెండు వికెట్లు సాధించింది. అనంతరం బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఏ దశలోనూ భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేకపోయింది. ఒకరి తర్వాత మరొకరిగా అంతా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో వంద పరుగులు కూడా చేయలేక చేతులెత్తేసింది. నహిదా ఖాన్ 23, కెప్టెన్ సనా మీర్ 29 పరుగులు చేసి జట్టును ఆదుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఏక్తా బిస్త్ కేవలం 18 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టగా, మాన్సీ జోషి 9 పరుగులకు రెండు వికెట్లు కూల్చింది.
దక్షిణాఫ్రికా ఘన విజయం: లీసెస్టర్‌లో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై దక్షిణాఫ్రికా పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 25.2 ఓవర్లలో కేవలం 48 పరుగులకే కుప్పకూలింది. చెడియన్ నేషన్ 26 పరుగులు చేసింది. మిగతా వారంతా సింగిల్ డిజిట్‌ను దాటలేదు. మరిజానే కాప్ 14 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టింది. డేన్ వాన్ నికెర్క్ కూడా నాలుగు వికెట్లు సాధించినప్పటికీ, ఒక్క పరుగు కూడా ఇవ్వకపోవడం విశేషం. 3.2 ఓవర్లు బౌల్ చేసిన ఆమె పరుగులేవీ ఇవ్వకుండానే నలుగురిని పెవిలియన్‌కు పంపింది. ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేసిన దక్షిణాఫ్రికా 6.2 ఓవర్లలో వికెట్ నష్టం లేకుండా 51 పరుగులు చేసి గెలిచింది. లారా వొల్వాట్ (19 నాటౌట్), లిజెల్ లీ (29 నాటౌట్) క్రీజ్‌లో నిలిచి, పది వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాకు విజయాన్ని అందించారు.
అదే విధంగా ఆదివారం జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో, శ్రీలంకపై ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా జట్లు గెలుపొందాయి. టౌన్టన్‌లో ఇంగ్లాండ్‌ను ఢీకొన్న శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్లకు 204 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లాండ్ 30.2 ఓవర్లలో మూడు వికెట్లకు 206 పరుగులు సాధించి, ఇంకా 118 బంతులు మిగిలి ఉండగానే ఏడు వికెట్ల ఆధిక్యంతో విజయాన్ని నమోదు చేసింది. బ్రిస్టల్‌లో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 219 పరుగులు చేసింది. అనంతరం ఆస్ట్రేలియా 48.4 ఓవర్లలో ఐదు వికెట్లకు 220 పరుగులు చేసి, ఐదు వికెట్ల తేడాతో గెలిచింది.

చిత్రం.. ఐదు వికెట్లు కూల్చిన ఏక్తా బిస్త్