క్రీడాభూమి

అజరెన్కా ముందంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 5: వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో విక్టోరియా అజరెన్కా మూడో రౌండ్ చేరింది. బుధవారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో ఆమె ప్రపంచ 15వ ర్యాంక్ క్రీడాకారిణి ఎలెనా వెస్నినాను 6-3, 6-3 తేడాతో వరుస సెట్లలో సులభంగా గెలిచి, ముందంజ వేసింది. మరో మ్యాచ్‌లో, వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఈ టోర్నీలోకి అడుగుపెట్టిన హీతర్ వాట్సన్ మొదటి అడ్డంకి సమర్థంగా పూర్తి చేసింది. రెండో రౌండ్‌లో ఆమె 18వ ర్యాంకర్ అనస్తాజియా సెవస్టొవాను 6-0, 6-4 తేడాతో ఓడించింది. అంతకు ముందు ప్రపంచ నంబర్ వన్ ఏంజెలిక్ కెర్బర్, మూడో ర్యాంకర్ కరోలినా ప్లిస్కోవా, ఐదో సీడ్ కరోలినా వొజ్నియాకి, ఏడో సీడ్ స్వెత్లానా కుజ్నెత్సొవా, తొమ్మిదో ర్యాంకర్ అగ్నీస్కా రద్వాన్‌స్కా, 12వ సీడ్ క్రిస్టినా మ్లాడెనొవిచ్, 14వ సీడ్ గార్బినె ముగురుజా తమతమ ప్రత్యర్థులను ఓడించి రెండో రౌండ్ చేరారు. సెరెనా విలియ మ్స్, మరియా షరపోవా వంటి స్టార్లు లేకపోవడంతో మహిళల విభాగంలో పోరు ఆసక్తికరంగా మారిన విషయం తెలిసిందే.
మూడో రౌండ్‌కు ముర్రే
పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్ వన్ ఆండీ ముర్రే మూడో రౌండ్ చేరాడు. అతను రెండో రౌండ్‌లో డస్టిన్ బ్రౌన్‌ను 6-3, 6-2, 6-2 తేడాతో ఓడించాడు. మరో మ్యాచ్‌లో తొమ్మిదో సీడ్ కెయ్ నిషికొరీ 6-4, 6-7, 6-1, 7-6 స్కోరుతో సెర్గీ స్టాకొవ్‌స్కీపై గెలుపొందాడు. ఏడో సీడ్‌గా అడుగుపెట్టిన మారిన్ సిలిక్ రెండో రౌండ్ మ్యాచ్‌లో ఫ్లోరియన్ మేయర్‌పై 7-6, 6-4, 7-5 తేడాతో విజయం సాధించాడు. 12వ ర్యాంక్ ఆటగాడు జో విల్‌ఫ్రెడ్ సొంగా తన రెండో రౌండ్‌లో సిమోన్ బొలెల్లీని 6-1, 7-5, 6-2 ఆధిక్యంతో ఓడించి మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. రాబర్టో బటిస్టా అగుట్ 6-2, 6-1, 3-6, 6-3 స్కోరుతో పీటర్ జొకోవ్‌జిక్‌పై గెలిచి, ముందడుగు వేశాడు. ఎజాజ్ బెడెన్ 6-3, 3-6, 6-3, 6-3 ఆధిక్యంతో డామిర్ జుమర్‌ను ఓడించాడు.
కాగా, అంతకు ముందు జరిగిన మ్యాచ్‌ల్లో ప్రపంచ రెండో ర్యాంక్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్, మూడో సీడ్ రోజర్ ఫెదరర్, ఆరో సీడ్ మిలోస్ రోనిక్, ఎనిమిదో ర్యాంకర్ డొమినిక్ థియేమ్, థామస్ బెర్డిచ్, జువాన్ మార్టిన్ డెల్ పొట్రో, కేల్ ఎడ్మండ్ తదితరులు కూడా మొదటి రౌండ్ పోరాటాలను సమర్థంగా పూర్తి చేశారు.