క్రీడాభూమి

దక్షిణాఫ్రికాపై గెలిచిన ఇంగ్లాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిస్టల్: దక్షిణాఫ్రికాతో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 68 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 373 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. టామీ బ్యూవౌట్, సారా టేలర్ శతకాలతో రాణించారు. విజయానికి 374 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉండగా, చివరి వరకూ పోరాడిన దక్షిణాఫ్రికా 9 వికెట్లకు 305 పరుగులు చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 679 పరుగులు నమోదుకాగా, 14 వికెట్లు పడ్డాయ. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టిన బ్యూవౌట్ 148 పరుగులు సాధించగా, ఆమెతో పోటీపడుతూ సారా టేలర్ 147 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్ మరిజానే కాప్ 77 పరుగులిచ్చి మూడు వికెట్లు కూల్చింది. అనంతరం దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌కు ఓపెనర్లు లారా వాల్‌వార్ట్ (67), లిజెల్లే లీ (72) శుభారంభాన్నిచ్చారు. మొదటి వికెట్‌కు 128 పరుగులు జోడించి, విజయంపై అభిమానులకు ఆశలు కల్పించారు. అయతే, లిజెల్లే లీ రూపంలో మొదటి వికెట్ చేజార్చుకున్న దక్షిణాఫ్రికా ఆతర్వాత కోలుకోలేకపోయంది. ఎంత ప్రయత్నించినా పరుగుల వేటలో వెనుకబడి, ఓటమిని చవిచూసింది. ఇంగ్లాండ్ బౌలర్ డానియెలా హాజెల్ 70 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టింది. హీతర్ నైట్ 52 పరుగులిచ్చి రెండు వికెట్లు సాధించింది.