క్రీడాభూమి

మిథాలీ బృందం గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెర్బీ, జూలై 5: మహిళల ప్రపంచ కప్‌లో భారత జట్టు సత్తా చాటుతూ, వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో దీప్తి శర్మ, కెప్టెన్ మిథాలీ రాజ్ అర్థ శతకాలతో రాణించగా, 8 వికెట్లకు 232 పరుగులు సాధించిన భారత్ ఆతర్వాత ప్రత్యర్థిని ఏడు వికెట్లకు 216 పరుగులకే కట్టడి చేసింది. బౌలింగ్‌లో ఝూలన్ గోస్వామి, పూనమ్ యాదవ్ చెరి రెండు వికెట్లు పడగొట్టి, భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు దీప్తి శర్మ, మిథాలీ అండగా నిలిచారు. దీప్తి 110 బంతులు ఎదుర్కొని 10 ఫోర్ల సాయంతో 78 పరుగులు సాధించింది. మిథాలీ 78 బంతుల్లో 53 పరుగులు చేసింది. ఆమె స్కోరులో నాలుగు ఫోర్లు ఉన్నాయి. లంక బౌలర్ శ్రీపాలి వీరకొడి 28 పరుగులిచ్చి మూడు వికెట్లు కూల్చింది. ఇనొకా రణవీర 55 పరుగులకు రెండు వికెట్లు సాధించింది. ఆతర్వాత బ్యాటింగ్ చేసిన లంక పరుగుల వేటలో వెనుకబడింది. సురంగిక (61), శశికళ సిరివర్దన (37) తప్ప మిగతా వారు పరుగుల వేటలో రాణించలేకపోయారు. ఫలితంగా విజయానికి లంక 17 పరుగుల దూరంలో ఆగిపోయింది. ఝూలన్ గోస్వామికి 26 పరుగులకు 2, పూనమ్ యాదవ్ 23 పరుగులకు 2 చొప్పున వికెట్లు కూల్చారు.
ఆసీస్ అలవోక విజయం
లీసెస్టర్: పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ని ఆస్ట్రేలియా 159 పరుగుల భారీ తేడాతో అవలీలగా గెల్చుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 8 వికెట్లకు 290 పరుగులు సాధించింది. ఎలైస్ పెర్రీ (66), ఎలిస్ విలానీ (59), అలిసా హీలీ (63 నాటౌట్) అర్ధ శతకాలతో రాణించారు. పాక్ బౌలర్లలో సనా మీర్ 49 పరుగులకు మూడు వికెట్లు కూల్చగా, సదియా యూసుఫ్ 66 పరుగులిచ్చి రెండు వికెట్లు పడొగట్టింది.
అనంతరం, 291 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన పాకిస్తాన్ సరిగ్గా 50 ఓవర్లలో 131 పరుగులకే కుప్పకూలింది. ఇన్నింగ్స్ చివరి రెండు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోవడంతో, పాక్ పతనం సంపూర్ణమైంది. మిడిల్ ఆర్డర్‌లో సనా మీర్ 45, అస్మావియా ఇక్బాల్ 10, ఇరామ్ జావేద్ 21 చొప్పున పరుగులు చేశారు. వీరు తప్ప మిగతా వారెవరూ కనీసం రెండంకెల స్కోర్లను కూడా చేరుకోలేకపోవడంతో పాకిస్తాన్‌కు దారుణ పరాభవం తప్పలేదు.