క్రీడాభూమి

వనే్డ సిరీస్ ఫలితంపై ఉత్కంఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కింగ్‌స్టన్ (జమైకా), జూలై 5: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి వనే్డ గురువారం జరగనుండగా, సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మొదటి మ్యాచ్ వర్షం వల్ల రద్దుకాగా, ఆతర్వాత వరుసగా రెండు విజయాలు సాధించిన భారత్ 2-0 ఆధిక్యాన్ని సంపాదించింది. అయితే, నాలుగో వనే్డను అనూహ్యంగా 11 పరుగుల తేడాతో చేజార్చుకుంది. బౌలర్లు రాణించడంతో విండీస్‌ను 50 ఓవర్లలో 9 వికెట్లకు 189 పరుగులకే పరిమితం చేయగలిగిన విరాట్ కోహ్లీ సేన ఆతర్వాత అత్యంత సాధారణమైన లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయింది. 49.4 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌటైంది. అజింక్య రహానే (60), మహేంద్ర సింగ్ ధోనీ (54) అర్ధ శతకాలను మినహాయిస్తే, భారత బ్యాట్స్‌మెన్ పరుగుల వేటను కొనసాగించలేకపోయారు. ధోనీ హాఫ్ సెంచరీ చేసినప్పటికీ, 114 బంతులు తీసుకోవడం అతని సామర్థ్యంపై అనుమానాలకు తావిస్తున్నది. రవీంద్ర జడేజా కూడా ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఓపెనర్లు రహానే, శిఖర్ ధావన్ బాగానే పరుగులు సాధించిన మ్యాచ్‌ల్లో మిగతా వారు విఫలమైనప్పటికీ భారత్ మెరుగైన ఫలితాలనే రాబడుతున్నది. దీనితో మిడిల్ ఆర్డర్, లోయర్ మిడిల్ ఆర్డర్ పరిస్థితి దారుణంగా ఉందనే విషయం తెరపైకి రావడం లేదు. కానీ, నాలుగో వనే్డలో కేవలం 190 పరుగుల లక్ష్యాన్ని కూడా అందుకోలేకపోవడం జట్టు నిలకడలేమిని, ప్రధానంగా మిడిల్ ఆర్డర్ వైఫల్యాలను బట్టబయలు చేసింది. ఇదే పరిస్థితి చివరి వనే్డలోనూ కొనసాగితే, ద్వితీయ శ్రేణి ఆటగాళ్లు ఎక్కువ మంది ఉన్న విండీస్‌తో సిరీస్‌ను గెల్చుకోలేక, కోహ్లీ బృందం డ్రాతో సంతృప్తి చెందాలి. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఓడించలేక ఇప్పటికే ఇంటాబయటా విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియాకు సిరీస్‌ను గెలిస్తే తప్ప పరువు నిలవని పరిస్థితి. అందుకే, అత్యంత కీలకంగా మారిన చివరి వనే్డలో తుది జట్టును ఎంపిక చేసుకోవడానికి కోహ్లీ చాలా జాగ్రత్తలు తీసుకోక తప్పదు. చాలా కాలం తర్వాత మళ్లీ వనే్డలో ఆడే అవకాశాన్ని దక్కించుకున్న దినేష్ కార్తీక్ విఫలమయ్యాడు. 19 బంతులు ఎదుర్కొన్న అతను కేవలం రెండు పరుగులు చేసి అవుటయ్యాడు. ఈ పరిస్థితుల్లో అతనికి మరోసారి తుది జట్టులో అవకాశం దక్కకపోవచ్చు. కానీ, కండరాల నొప్పితో బాధపడిన యువరాజ్ సింగ్ పూర్తి ఫిట్నెస్‌తో లేని కారణంగా దినేష్ కార్తీక్‌ను బరిలోకి దించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కాగా, కేదార్ జాదవ్ ఎన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. గురువారం నాటి మ్యాచ్‌లో కోహ్లీ అతనికి మరో అవకాశం ఇవ్వడం అనుమానంగానే కనిపిస్తున్నది. తక్కువ స్కోరును కూడా సమర్థంగా రక్షించుకొని, 11 పరుగుల తేడాతో విజయం సాధించిన ఉత్సాహంతో చివరి పోరాటానికి సిద్ధమవుతున్న జాసన్ హోల్డర్ నాయకత్వంలోని విండీస్ మరోసారి టీమిండియాకు షాకిచ్చినా ఆశ్చర్యం లేదు. నిలకడలేమి, మితిమీరిన జాగ్రత్త, వ్యక్తిగత ప్రయోజనాలు వంటి లోపాలను అధిగమిస్తే తప్ప భారత్‌కు విండీస్ గడ్డపై సిరీస్ దక్కదు.
చిత్రం.. నెట్స్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీట్లు