అంతర్జాతీయం

ముంబయకి వచ్చేయండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెల్ అవీవ్, జూలై 5: ముంబయిలో 2008లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ప్రాణాలతో బైటపడిన ఓ చిన్నారి మోషేను ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీని బుధవారం జెరూసలేంలో కలుసుకొన్నారు. 2008లో ఉగ్రవాదులు ముంబయిలోని చాబాద్ హౌస్‌పై దాడి చేసినప్పుడు మోషే హోల్జ్‌బెర్ వయసు రెండేళ్లు మాత్రమే. టెర్రరిస్టులు మోషే తల్లిదండ్రులు రివ్కా, గావ్రియెల్ హోల్జ్‌బెర్గ్‌లతో పాటుగా చాలామందిని హతమార్చారు. మోషే నానీ (నాన్నమ్మ) శాండ్రా శామ్యూల్ కూడా అదే బిల్డింగ్‌లో ఉంటున్నారు. అయితే ఆమె మెట్ల కింద ఉండే ఓ గదిలో దాక్కొని ప్రాణాలు దక్కించుకున్నారు. మోషే ఏడ్పులు విన్న తర్వాత ఆమె బైటికి వచ్చి చూసేసరికి రెండేళ్ల ఆ పసివాడు విగతజీవులై పడి ఉన్న అమ్మానాన్నలు రబ్బీ గావ్రియెల్, రివ్కాహోల్జ్‌బెర్గ్‌ల మధ్య ఏడుస్తూ కనిపించాడు. వెంటనే ఆ చిన్నారిని పొదువుకున్న ఆమె ఆ భవనంనుంచి పారిపోయింది. ప్రస్తుతం మోషే ఇజ్రాయెల్‌లోని అఫులాలో తన తాత, అమ్మమ్మ రబ్బీ షిమోన్ రోసెన్‌బెర్గ్, యెహుదిత్‌ల వద్ద పెరుగుతున్నాడు. శాండ్రా శామ్యూల్ కూడా ప్రస్తుతం జెరూసలెంలోనే ఉంటున్నారు. ప్రస్తుతం 11 ఏళ్ల వయసున్న మోషే, అతని నానమ్మ, తాత, అమ్మమ్మలతో బుధవారం ప్రత్యేకంగా సమావేశమైన మోదీ వారిని భారత్‌కు వచ్చి ముంబయిలో నివసించాలని ఆహ్వానించారు. ‘మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘకాలిక వీసా లభిస్తుందని, మీరు ఎప్పుడైనా రావచ్చని, ఎక్కడికయినా వెళ్లవచ్చని మోదీ ఆ చిన్నారితో అన్నారు. ‘ఆప్‌కా స్వాగత్ హై హమారా దేశ్‌మే’ అంటూ హిందీలో మోదీకి మోషే స్వాగతం పలికారు. తాను పెద్దయ్యాక ముంబయి వస్తానని, అక్కడే ఉంటానని ఆశిస్తున్నానని కూడా మోషే చెప్పాడు. అంతేకాదు అతను మోదీకి ఒక ఫోటోను కానుకగా ఇచ్చాడు కూడా. 125 కోట్ల భారతీయులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాని మోదీ తమను కలుసుకోవాలని అనుకోవడం తమకెంతో ప్రత్యేకమైందని కూడా షిమోన్ అన్నారు. తమను మర్చిపోనందుకు, భారతీయులు తమ బాధను పంచుకొంటున్నందుకు తమకెంతో సంతోషంగా ఉందని అన్నారు. కాగా, తన మనవడికి 13 ఏళ్ల వయసు వచ్చాక జరిపే ‘బార్ మిత్వా’ (ఉపనయనం తరహా వేడుక)ను భారతీయ పూజారులతో జరిపించాలని అనుకుంటున్నట్లు కూడా ఆయన చెప్పారు.