కృష్ణ

పేదల భూములను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), జూలై 17: గత ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన పట్టా భూములను ఆక్రమించి అమ్మకానికి పాల్పడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ మాజీ విప్, వైసిపి నాయకుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ స్థానిక వైఎస్‌ఆర్ కాలనీలో 2007వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలకు సెంటున్నర చొప్పున నివేశన స్థలాలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కొంత మంది టిడిపి నాయకులు అమాయకులైన పేద వర్గాల నుండి పట్టాలు తీసుకుని హౌసింగ్ బోర్డు ద్వారా పక్కా గృహాలు నిర్మిస్తామని మాయమాటలు చెప్పారన్నారు. ఈ విషయమైన బాధితులు అనేక సార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించి బాధితులకు న్యాయం చేయాలని ఆయన కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.