కృష్ణ

సిఎం కాన్వాయ్‌తో సందర్శకుల పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ముఖ్యమంత్రి కాన్వాయ్ రాక సందర్భంగా వివిధ సమస్యలపై సచివాలయానికి వచ్చిన సందర్శకులు సోమవారం ఇక్కట్లకు గురైయ్యారు. ఒక దశలో గేట్-2 వద్ద తోపులాట జరిగింది. అధిక సంఖ్యలో వచ్చిన సందర్శకులకు పాస్ చూసి అనుమతించేందుకు వీలు కాక, ఆధార్ కార్డు ఉంటే అనుమతించాల్సిన పరిస్థితి నెలకొంది. మండుటెండలో పరుగులెత్తించిన భద్రతా సిబ్బంది అత్యుత్సాహంపై సందర్శకులు ఆగ్రహం వ్యక్తం చేయడం కనిపించింది. సోమవారం కావడంతో అధిక సంఖ్యలో సందర్శకులు వచ్చారు. మధ్యాహ్నం 12 గంటల తరువాత సచివాలయానికి సిఎం వస్తున్నారని సమాచారం అందడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. దీంతో సందర్శకులకు పాస్‌ల జారీ నిలిపివేశారు. వెలగపూడి రోడ్డులో ఉన్న అన్న క్యాంటీన్‌ను మూయించేశారు. సిఎం రాక ఆలస్యం అవుతుందని తెలిసి, మళ్లీ పాస్‌లను జారీ చేసేందుకు నిర్ణయించారు. ఒక కానిస్టేబుల్‌ను అక్కడ ఏర్పాటు చేశారు. దీంతో మండుటెండలో పాస్ కోసం సందర్శకులు బారులు తీరారు. పాస్‌లు ఇస్తామని చెప్పిన కొద్ది సేపటికే సిఎం వస్తున్నారంటూ వారందరినీ సందర్శకుల భవనంలోకి పంపించారు. అక్కడ పాస్‌లు ఇస్తామని చెప్పడంతో సందర్శకులు పరుగులు పెడుతూ అక్కడికి వెళ్లడం కనిపించింది. అక్కడ పాస్‌లు ఇవ్వడం లేదని తెలిసి వారంతా రోడ్డు మీదకు రావడంతో వారిని నియంత్రించేందుకు భద్రతా సిబ్బంది రంగంలోకి దిగారు. వారి గదమాయింపులతో సందర్శకులు అసంతృప్తికి గురైయ్యారు. సందర్శకుల భవనం ఎదురుగా ఉన్న అన్నా క్యాంటీన్‌ను కూడా మూసి వేయమని ఆదేశించారు. దీంతో అమ్మకాలు నిలిపివేశారు. కొంతమంది భద్రతా సిబ్బందితో వాగ్విదానికి దిగారు. సిఎం కాన్వాయ్ దాదాపు మధ్యాహ్నం 12.45 గంటలకు వచ్చి గేట్-2 ద్వారా సచివాలయంలోకి ప్రవేశించింది. ఆ తరువాత సందర్శకులు మరోసారి పరుగులు పెడుతూ గేట్ వద్దకు వచ్చారు. అక్కడ సెక్యూరిటీ చెక్ కోసం మెటల్ డిటెక్టర్ వద్ద ఒక్కసారిగా సందర్శకులు రావడంతో తోపులాట జరిగింది. పరిస్థితి గమనించి గేటు మూసి వేశారు. పాస్‌లతో పని లేకుండా ఆధార్ కార్డు ఉన్న వారిని సచివాలయంలోనికి అనుమతించారు. సిఎం కాన్వాయ్ గేట్-2 నుంచి వెళ్తున్న కారణంగా, సందర్శకులను మాత్రం గేట్-1 నుంచి అనుమతిస్తే, కొంత సమస్య తీరుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వివిధ రకాల అనారోగ్య సమస్యలతో ఉన్న వారు, వృద్ధలు వస్తున్న నేపథ్యంలో క్యాంటీన్‌ల మూసివేత, తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయాలపై అధికారులు దృష్టి సారించాల్సి ఉంది.