క్రీడాభూమి

ఇది ఆరంభం మాత్రమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 26: మహిళల ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకోవడం ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో చిరస్మరణీయ విజయాలను సాధిస్తామని భారత జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అన్నది. ఇంగ్లాండ్‌లో జరిగిన వరల్డ్ కప్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన మిథాలీ బృందం బుధవారం ఇక్కడికి చేరుకున్నప్పుడు ఘన స్వాగతం లభించింది. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన భారత మహిళల జట్టుకు అధికారులు స్వాగతం పలికారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో అభిమానులు తరలి రావడం విశేషం. ఇంతకు ముందు అంర్జాతీయ టూర్లు లేదా సిరీస్‌లు ఆడిన తర్వాత మహిళల జట్టు స్వదేశానికి చేరుకుంటే, ఆ వార్త కూడా ఎవరికీ తెలిసేది కాదు. పురుషుల క్రికెట్‌కు మాత్రమే ప్రాధాన్యమిచ్చే అభిమానులు మహిళా క్రికెటర్లను పట్టించుకునేవారు కారు. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిందని, మహిళా క్రికెట్‌కు కూడా ఆదరణ పెరుగుతున్నదనడానికి వేలాది మంది విమానాశ్రయానికి రావడమే నిదర్శనం. ఇలాంటి స్వుగతాన్ని తాను ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదని మిథాలీ వ్యాఖ్యానించింది. మహిళల జట్టు ఉజ్వల భవిష్యత్తుకు ఇది ప్రారంభం మాత్రమేనని పేర్కొంది. మొదటి నుంచి మహిళా క్రికెటర్లు దేశానికి అత్యుత్తమ సేవలు అందించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తునే ఉన్నారని చెప్పింది. కానీ, ఈసారి మీడియా, బిసిసిఐ నుంచి మంచి మద్దతు లభించడంతో తమకు ఇలాంటి ఆదరణ లభించిందని తెలిపింది. మహిళా క్రికెట్‌కు ముందుముందు ఇంకా మంచి రోజులు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేసింది.