క్రీడాభూమి

నికెర్క్‌కు రికార్డు సాధ్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్: అసాధారణ అథ్లెట్‌గా ఉసేన్ బోల్ట్ నుంచి ప్రశంసలు అందుకున్న దక్షిణాఫ్రికా రన్నర్ వేడ్ వాన్ నికెర్క్‌కు అరుదైన రికార్డును సమం చేయడం సాధ్యమా? కాదా? అన్నది ఉత్కంఠ రేపుతున్నది. 25 ఏళ్ల నికెర్క్ 200 మీటర్లు, 400 మీటర్ల ఈవెంట్స్‌లో పోటీపడనున్నాడు. 1996లో మైఖేల్ జాన్సన్ ఈరెండు ఈవెంట్స్‌లోనూ పాల్గొని, రెండింటిలోనూ విజేతగా నిలిచాడు. ఆ రికార్డును సమం చేసేందుకు నికెర్క్ ప్రయత్నిస్తాడు. 400 మీటర్ల పరుగును 43.03 సెకన్లలో పూర్తి చేసి అతను ఇప్పటికే కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. 200 మీటర్ల ఈవెంట్‌లో ప్రపంచ రికార్డు ఉసేన్ బోల్ట్ పేరుపై ఉంది. వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో అతను ఆ రికార్డును కూడా బద్దలు చేస్తాడేమో చూడాలి. కాగా, ఉసేన్ బోల్ట్ తనను మెచ్చుకున్నప్పటికీ, తనను తాను గొప్ప అథ్లెట్‌నని అనుకోవడం లేదని నికెర్క్ అంటున్నాడు. ‘నేను ఇప్పటి వరకూ సాధించింది ఏమీ లేదు. అందుకోవాల్సిన లక్ష్యాలు చాలా ఉన్నాయి. ఉసేన్ బోల్ట్‌తో ఎన్నటికీ పోల్చుకోలేను. అత్యున్నత ప్రమాణాల విషయంలో అతని దరిదాపులకు చేరుకోగలిగినా జన్మధన్యమైనట్టు భావిస్తాను’ అని స్పష్టం చేస్తున్నాడు.