క్రీడాభూమి

రాహుల్‌కు చోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో: రెండో టెస్టులో ఓపెనర్ లోకేష్ రాహుల్‌కు చోటు లభిస్తుందని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన ప్రకటనతో అభినవ్ ముకుంద్ స్థానానికి ఎసరు తప్పే పరిస్థితి కనిపించడం లేదు. నిజానికి లంక టూర్‌కు ముందు ఎంపిక చేసిన జట్టులో శిఖర్ ధావన్ లేడు. రెగ్యులర్ ఓపెనర్ మురళీ విజయ్ గాయం కారణంగా సిరీస్ నుంచి వైదొలగడంతో, ధావన్‌కు చోటు దక్కింది. దానిని సద్వినియోగం చేసుకుంటే, అతను 168 బంతుల్లోనే 190 పరుగులు సాధించి, టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో 600 పరుగుల భారీ స్కోరును అందుకోవడానికి సహకరించాడు. కాగా, జ్వరంతో బాధపడుతున్న రాహుల్ మొదటి టెస్టుకు దూరంకాగా, ధావన్‌తో కలిసి ముకుంద్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. అతను కూడా రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ శతకాన్ని నమోదు చేసి సత్తా చాటుకున్నాడు. ఇప్పుడు రాహుల్ పూర్తి ఫిట్నెస్‌ను సంపాదించడంతో ముకుంద్ స్థానం ప్రమాదంలో పడింది. రెండో టెస్టులో రాహుల్ ఆడతానని కోహ్లీ చేసిన ప్రకటన పరోక్షంగా ముకుంద్‌ను తప్పిస్తున్నట్టు స్పష్టం చేయడమే. రాహుల్, మురళీ విజయ్ రెగ్యులర్ ఓపెనర్లుగా ఉంటే, బ్యాకప్ ఓపెనర్‌గా ముకుంద్‌ను సెలక్టర్లు తొలుత ఎంపిక చేశారు. కానీ, అనుకోకుండా జట్టులోకి వచ్చిన ధావన్ మొదటి మ్యాచ్‌లో విజృంభించి తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ముకుంద్ బెంచ్‌కే పరిమితమయ్యే ప్రమాదం కనిపిస్తున్నది.