క్రీడాభూమి

మరో విజయమే భారత్ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, ఆగస్టు 2: శ్రీలంకతో జరిగిన మొదటి టెస్టుని 304 పరుగుల భారీ తేడాతో గెల్చుకొని, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సంపాదించిన టీమిండియా మరో విజయంపై కనే్నసింది. గురువారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టును కూడా సాధిస్తే, సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకోవచ్చన్న ఉద్దేశంతో, సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమైంది. లంకతో పోలిస్తే విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా అన్ని విభాగాల్లోనూ బలంగా ఉంది. మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 600 పరుగులు సాధించడం భారత బ్యాటింగ్ సామర్థ్యానికి నిదర్శనం. లంకను రెండు పర్యాయాలు అలౌట్‌చేసి, మ్యాచ్‌ని నాలుగు రోజుల్లోనే ముగించడం బౌలర్ల ప్రతిభకు తార్కాణం. గత ఏడాది ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టును 3-0 తేడాతో చిత్తుచేసి, టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన శ్రీలంక అదే స్థాయికి తగినట్టుగా ఆడలేకపోతున్నది. పలువురు కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడడం అందుకు ఒక కారణమైతే, స్పిన్ తీరు మరో కారణం. లంక జట్టు బౌలింగ్ విభాగంలో బలాబలాలను దృష్టిలో ఉంచుకొని క్యూరేటర్లు పిచ్‌లను సిద్ధం చేశారు. అక్కడి వాతావరణం, పిచ్ తీరు ఆస్ట్రేలియా క్రికెటర్లకు ఎంత మాత్రం సహకరించలేదు. ఫలితంగా ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. కానీ, అదే సూత్రాన్ని తాజా సిరీస్‌లోనూ అనుసరించడమే లంకను దెబ్బతీస్తున్నది. ఒక రకంగా చెప్పాలంటే, భారత క్రికెటర్లకు మ్యాచ్‌లు స్వదేశంలో ఆడుతున్నట్టే ఉంది. ఉప ఖండంలో వాతావరణం ఒకే రకంగా ఉండడం, పిచ్‌లను కూడా అదే రీతిలో తీర్చిదిద్దడంతో, టీమిండియా క్రికెటర్లకు ఎలాంటి ఇబ్బంది తలెత్తడం లేదు. అటు లంక జట్టుతోగానీ, ఇటు పిచ్ తీరుతోగానీ సమస్యలు లేకపోవడంతో, భారత్ రెండో టెస్టులోనూ ఫేవరిట్ ముద్రతో బరిలోకి దిగుతున్నది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ధోనీ సేన నంబర్ వన్ స్థానంలో ఉంటే, శ్రీలంకది ఏడో స్థానం. రెండు జట్ల మధ్య ఉన్న వ్యత్యాసానికి ఈ తేడానే నిదర్శనం. మొదటి టెస్టులో దారుణంగా విఫలమైన లంక ఏదైనా అద్భుతం జరిగితే తప్ప రెండో టెస్టులో గెలవడం అసాధ్యం. ఇలాంటి పరిస్థితుల్లో వ్యూహాత్మకంగా ఆడి, మ్యాచ్‌ని డ్రా చేసుకోవడానికి ప్రయత్నిస్తేనే కొంతలో కొంతైనా పరువు దక్కుతుంది. చివరి టెస్టులో భారత్‌ను ఒత్తిడికి గురిచేసి, విజయం సాధించే అవకాశాలను మెరుగు పరచుకుంటుంది. కానీ, ఇవన్నీ అనుకున్నంత సులభం కాదనేది వాస్తవం.
భారత కాలమానం ప్రకారం మ్యాచ్ గురువారం ఉదయం 10.30 గంటలకు మొదలవుతుంది.