అంతర్జాతీయం

హెచ్-1బి వీసాల దుర్వినియోగాన్ని ఆపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఆగస్టు 2: అమెరికా వర్కర్లస్థానం లో చౌకగా లభించే విదేశీ వర్కర్లను నియమించుకోవడం కోసం ఔట్‌సోర్సింగ్ సంస్థలు హెచ్- 1బి, ఎల్-1 వీసాలను దుర్వినియోగం చేయడాన్ని ఆపాలని, అమెరికా కాంగ్రెస్ ఉభయ సభ ల్లో పలుకుబడిన సభ్యులతో కూడిన బృందం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఒక లేఖ రాసింది. జూలై 27న రాసిన ఈ లేఖను మంగళవారం మీడియాకు విడుదల చేశారు. ఈ లోపాలను తొలగించి అమెరికా వర్కర్లకు రక్షణ కల్పించడం కోసం అత్యున్నత నైపుణ్యం ఉండే ఉద్యోగాలను అమెరికా వర్కర్లకు లభించకుండా చేస్తున్న ఔట్‌సోర్సింగ్ కంపెనీలను కట్టడి చేయడం కోసం మొత్తం వీసా విధానాన్ని ప్రక్షాళన చేయడం కోసం తాము ఒక చట్టాన్ని ప్రవేశపెట్టినట్లు ఆ గ్రూపు తమ లేఖలో పేర్కొంది. చాలాకాలంగా హెచ్-1బి వీసాల దుర్వినియోగం జరుగుతున్న కారణంగా తాము ఈ లేఖ రాస్తున్నామని, అధ్యక్షుడిగా మీకున్న విశేషాధికారాలను ఉపయోగించి దీనికి అడ్డుకట్ట వేయాలని కోరుతున్నామని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే చట్టంలో లోపాలున్న కారణంగా వీసా విధానాన్ని చట్టపరంగా సంస్కరించాల్సిన అవసరం కూడా ఉందని తాము భావిస్తున్నామని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ సభ్యుడు బిల్ పాస్క్రెల్ నేతృత్వంలో రూపొందించిన ఈ లేఖపై సెనేటర్ రిచర్డ్ డర్బిన్, కాంగ్రెస్ సభ్యులు డేవ్ బ్రాట్, రో ఖన్నా, పౌల్ ఎ గోసర్ తదితరులు సంతకాలు చేశారు.