తెలంగాణ

అతి వృష్టి.. అనావృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 4: తెలంగాణ రాష్ట్రంలో ఒక వైపు అతి వృష్టి, మరో వైపు అనావృష్టి పరిస్ధితులు నెలకొన్నాయి. అతి వృష్టి ఉన్న ప్రదేశంలో తెలంగాణ రూపురేఖలను మార్చేయనున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఉంది. భూపాలపల్లి జిల్లాలో మేడిగడ్డ వద్ద గోదావరి నది నుంచి ఈ ఏడాది గత రెండు నెలల్లో కురిసిన వర్షాలకు దాదాపు 220 టిఎంసి నీరు దిగువున ప్రవహించి ఆంధ్రప్రదేశ్‌లోని ధవళేశ్వరం బ్యారేజీ ద్వారా బంగాళాఖాతంలో కలిసింది. మేడిగడ్డ వద్ద ఎగువున ప్రాణహిత, అదే ప్రాంతంలో ఇంద్రావతి నదులు గోదావరి నదిలో కలుస్తాయి. ఈ నీటిని ఒడిసిపట్టే ప్రాజెక్టులు మేడిగడ్డ వద్ద లేవు. ముఖ్యమంత్రి కెసిఆర్ చొరవ వల్ల కాళేశ్వరం ప్రాజెక్టులో వివిధ దశలు ఇంకా నిర్మాణంలో ఉన్నాయి. దాదాపు 80 వేల కోట్ల రూపాయలతో నిర్మించే ఈ ప్రాజెక్టు అన్ని దశలు పూర్తయితే నిజంగా రాష్ట్రంలోని 15 జిల్లాల్లో 18 లక్షల ఎకరాల భూములు సస్యశ్యామలమవుతాయి. అలాగే కోటిన్నర ప్రజల దాహార్తి తీరనుంది.
గత రెండు వారాలుగా రాష్ట్రంలో వర్షాలు లేవు. కాని దండకారణ్యం ప్రాంతంలో మేడిగడ్డ వద్ద ప్రవహిస్తున్న గోదావరికి మహారాష్ట్ర, చత్తీస్‌గడ్, ఒరిస్సా రాష్ట్రాల్లో కురిసే వర్షాల నీరు ప్రాణహిత, ఇంద్రావతి నదుల ద్వారా వరద నీరు చేరుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కృష్ణా బేసిన్‌లో నీటి చుక్క లేక రైతులు విలవిలలాడుతన్నారు. కృష్ణా బేసిన్‌లో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీరు అడుగంటడంతో ఈ ఆయకట్టల కింద ఖరీఫ్‌సాగుకు నీరు లేదు. మేడిగడ్డకు ఎగువున ఉన్న గోదావరి నది వద్ద కడెం రిజర్వాయర్‌లో 7.6 టిఎంసికి కేవలం 4.811 టిఎంసి నీటినిల్వ ఉంది. ఇన్‌ఫ్లో లేదు. నిజాంసాగర్‌లో నీటి మట్టం 17.803 టిఎంసికి 1.35 టిఎంసి, లోయర్ మానెరులో 24.074 టిఎంసికి 7.394 టిఎంసి నీటి నిల్వలు ఉన్నాయి. శ్రీపాద యల్లంపల్లి వద్ద 20.175 టిఎంసికి 10.47 టిఎంసి, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద 90.313 టిఎంసికి కేవలం 9.582 టిఎంసి నీటి నిల్వలు ఉన్నాయి.
కృష్ణా బేసిన్‌లో కర్నాటకలో ఆల్మట్టి ప్రాజెక్టు నిండింది. 129.321 టిఎంసికి 128.19 టిఎంసి, నారాయణ్‌పూర్‌లో 37.646 టిఎంసికి 37.04 టిఎంసి నీరు ఉంది. తెలంగాణ ముఖ ద్వారంలో ఉన్న జూరాలలో 9.657 టిఎంసికి 5.52 టిఎంసి నీరు ఉంది. శ్రీశైలంలో 215.807 టిఎంసికి 19.62 టిఎంసి, నాగార్జునసాగర్‌లో 312.045 టిఎంసికి కేవలం 116.26 టిఎంసి నీరు, ఆంధ్రాలో పులిచింతలలో 45.77 టిఎంసికి 3.21 టిఎసి నీటి లభ్యత ఉంది.
గోదావరి నదిపై గతంలో నిర్మించిన, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల వివరాలపై ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు సమగ్రమైన వివరాలు ఇవ్వలేదని గోదావరి బోర్డు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లింది. గత నెలలో ఇక్కడ జరిగిన సమావేశంలో ప్రాజెక్టుల వివరాలు అందివ్వాలని, అప్పుడే తాము నీటి లభ్యత, వినియోగంపై ప్రణాళికను ఖరారు చేయగలమని బోర్డు రెండు రాష్ట్రాలకు తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై మాత్రం తెలంగాణ ప్రభుత్వం కూలంకషమైన నివేదిక ఇచ్చినట్లు సమాచారం. మిగిలిన ప్రాజెక్టులపై మాత్రం అందించాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరంతో పాటు పట్టిసీమ, పురుషోత్తంపట్నం, తాడిపూడి, పుష్కర, వెంకటనగరం, భూపతిపాలెం వద్ద నిర్మాణంలో ఉన్న పథకాలపై నివేదికలు ఇవ్వలేదని గోదావరి బోర్డు కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖకు తెలిపింది.