తెలంగాణ

తెలంగాణ టెట్ ఫలితాల వెల్లడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 4: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలను పాఠశాల విద్య కమిషనర్ జి కిషన్ శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషదన్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఫలితాలను విడుదల చేస్తూ, పేపర్-1లో 57.37 శాతం, పేపర్-2లో 19.51 శాతం ఉత్తీర్ణులైనట్టు చెప్పారు. పాఠశాలల విద్యా ప్రణాళికలో డ్రగ్స్ నియంత్రణపై పాఠ్యాంశాలను చేర్చి అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు.
టెట్ పరీక్షల్లో 98,883 మంది పేపర్-1 రాయగా 56,708 మంది అభ్యర్ధులు ఉత్తీర్ణత సాధించారు. ఇక పేపర్-2కు 2,30,932 మంది అభ్యర్ధులు హాజరుకాగా 45,055 మంది అభ్యర్ధులు ఉత్తీర్ణత సాధించారు. పేపర్ -2 గణితం, సైన్స్ పరీక్షలో 1,11,018 మంది హాజరుకాగా 20,323 మంది అంటే 18.31 శాతం మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. పేపర్-2 (సాంఘిక శాస్త్రం) పరీక్షకు 1,19,914 మంది పరీక్ష రాయగా 24,732 మంది అంటే 20.62 శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. జూలై 23న రాష్టవ్య్రాప్తంగా నిర్వహించిన టెట్ పరీక్షకు 2,30,932 మంది హాజరయ్యారు.
మొత్తంగా చూస్తే పేపర్-1లో 56,708 మంది పాసైనా, పేపర్-2లో మాత్రం మాథ్స్, సోషల్ విభాగాల్లో పాసైన వారి సంఖ్య 45,055 మాత్రమే. 1,11,018 మంది మాథ్స్‌లో పరీక్ష రాయగా కేవలం 20,323 మంది మాత్రమే పాస్ కావడంపై అభ్యర్ధులు షాక్‌కు గురయ్యారు. అలాగే సోషల్‌లో 1,19,914 మంది పరీక్ష రాయగా కేవలం 24,732 మంది మాత్రమే పాసయ్యారు.
ఫలితాల గణాంకాలు
పేపర్-1లో ఆదిలాబాద్ 48.78 శాతం, కొమరంభీం 61.93 శాతం, మంచిర్యాల జిల్లా 70.96 , నిర్మల్ 62.76, నిజామాబాద్ 60.69, కామారెడ్డి 68.04 శాతం పాసయ్యారు. జగిత్యాల జిల్లాలో 71.32, పెద్దపల్లిలో 68.70, రాజన్న జిల్లాలో 74.27, వరంగల్ రూరల్ 58.50 శాతం, వరంగల్ అర్బన్ 61.09 శాతం, మహబూబాబాద్‌లో 68.30 శాతం, జయశంకర్ 58.11 శాతం, జనగామలో 60.26 శాతం, ఖమ్మంలో 59.07, నల్గొండలో 56.86 శాతం, సూర్యాపేటలో 62.66 శాతం, యాదగిరిలో 62.32 శాతం, మహబూబ్‌నగర్‌లో 59,98 శాతం, వనపర్తిలో 63.36, నాగర్‌కర్నూలులో 60.61, రంగారెడ్డి 48.40, వికారాబాద్ 51.98 శాతం, మెదక్ 61.93 శాతం, సంగారెడ్డి 55.14 శాతం, సిద్దిపేటలో 66.71 శాతం, హైదరాబాద్ 54.75 శాతం, భద్రాద్రి జిల్లాలో 47.90 శాతం, జోగులాంబలో 64.71 శాతం, మేడ్చెల్‌లో 49.19 శాతం ఉత్తీర్ణులయ్యారు.