తెలంగాణ

విభజన చట్టంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 4: ఏపి విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని తెరాస సభ్యుడు ఏఎస్‌ఆర్ నాయక్ ఎన్‌డిఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాయక్ శుక్రవారం లోక్‌సభలో విశాఖపట్నంలో భారత పెట్రోలియం పరిశోధనా సంస్థను ఏర్పాటు చేసేందుకు సంబంధించిన ఎనర్జీ బిల్‌పై జరిగిన చర్చలో పాల్గొన్నారు. ఏపిలో పట్రోలియం పరిశోధనా సంస్థను ఏర్పాటు చేయటం తమకు సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. ఈ బిల్లుకు తాము పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నామన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు భారత పెట్రోలియం సంస్థను ఏర్పాటు చేయటం ముదావహమంటూ విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీల సంగతి ఏమిటని నాయక్ ప్రశ్నించారు.
తెలంగాణలో ఐఐఎం, గిరిజన విశ్వవిద్యాలయం, ఉద్యానవన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలో హామీ ఇచ్చారు, అయితే ఈ హామీలను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇంత వరకు ఎలాంటి చర్య తీసుకోకపోవటం దురదృష్టకరమని నాయక్ చెప్పారు. తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తే దేశంలోని దాదాపు పది కోట్ల మంది గిరిజనులకు మేలు జరుగుతుందన్నారు. గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తే ఉన్నత చదువుల పట్ల గిరిజనుల విశ్వాసం పెరుగుతుందని నాయక్ చెప్పారు. తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని వీలున్నంత త్వరగా ఏర్పాటు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బయ్యారం ఉక్కు కార్మాగారం ఏర్పాటు ఏమయ్యిందని నాయక్ ప్రశ్నించారు.