క్రీడాభూమి

తిరుగులేని మో ఫరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఆగస్టు 5: బ్రిటిష్ సూపర్ అథ్లెట్ మో ఫరా 10,000 మీటర్ల పరుగులో తనకు తిరుగులేదని మరోసారి రుజువు చేసుకున్నాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో అతను ఈ విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. లక్ష్యాన్ని మో ఫరా 26:49.51 నిమిషాల్లో పూర్తి చేయగా, చివరి వరకూ అతనికి గట్టిపోటీనిచ్చిన ఉగాండా యువ అథ్లెట్ జాషువా చెప్టేగెయ్ 26:49.94 నిమిషాలతో రజత పతకాన్ని అందుకున్నాడు. కెన్యాకు చెందిన పాల్ టనూయ్ 26:50.60 నిమిషాల్లో రేస్‌ను పూర్తి చేసి కాంస్య పతకాన్ని స్వీకరించాడు. అంతర్జాతీయ వేదికలపై వరుసగా పదోసారి పది వేల మీటర్ల పరుగులో టైటిల్ సాధించిన మో ఫరా రేస్ ఆరంభం నుంచి చివరి వరకూ వ్యూహాత్మకంగా వ్యవహరించాడు. 16 ల్యాప్స్ వరకూ జాషువా చెప్టేగెయ్, పాల్ టనూయ్, జెఫ్రీ కాంవొరర్ తదితరులు వేగంగా తనను అధిమించి ముందుకు దూసుకెళ్లినప్పటికీ, మో ఫరా ఏమాత్రం ఒత్తిడికి గురికాలేదు. నిదానమే ప్రదానం అన్న రీతిలో అతను నిలకడైన వేగంతో పరిగెత్తాడు. ఒకానొక దశలో 11వ స్థానానికి వెళ్లడంతో, అభిమానులు ఆందోళన చెందారే తప్ప మో ఫరాలో ఏమాత్రం అలజడి కనిపించలేదు. చివరి 14 ల్యాప్స్ ఉన్నప్పుడు అతను క్రమంగా వేగాన్ని పెంచాడు. చివరి రెండు ల్యాప్స్‌లో అద్వితీయ వేగాన్ని అందుకున్నాడు. అంతకు ముందు వరకూ వేగంగా పరిగెత్తి, మో ఫరాను దాటుకొని ముందుకు దూసుకెళ్లిన చాలా మంది అలసటతో వెనుకబడ్డారు. ఒక్కొరినే అధిగమిస్తూ ముందుకు దూసుకెళ్లిన మో ఫరాకు చివరికి జాషువా చెప్టేగెయ్, పాల్ టనూయ్ నుంచి గట్టిపోటీ తప్పలేదు. ఫినిషింగ్ లైన్‌ను అందరి కంటే ముందుగా చేరుకోవడమే లక్ష్యంగా ఎంచుకున్న మో ఫరా చివరి క్షణాల్లో వేగాన్ని మరింత పెంచాడు. 0.43 సెకన్ల తేడాతో జాషువా చెప్టేగెయ్‌ని రెండో స్థానానికి నెట్టి, విజేతగా నిలిచాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన స్టేడియంలో అతను ప్రపంచ చాంపియన్‌షిప్స్ టైటిల్‌ను అందుకోవడం విశేషం.
బోల్ట్ తడబాటు!
100 మీటర్ల స్ప్రింట్‌లో టైటిల్‌ను నిలబెట్టుకోవడానికి బరిలోకి దిగిన ‘జమైకా చిరుత’ ఉసేన్ బోల్ట్ హీట్స్‌లో అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. రేస్ ఆరంభంతో తడబడినప్పటికీ, ఆతర్వాత అతను వేగాన్ని పుంజుకున్నాడు. అమెరికాకు చెందిన తన చిరకాల ప్రత్యర్థి జస్టిన్ గాట్లిన్ నుంచి ఎదురైన సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటూ హీట్స్‌ను 10.07 సెకన్లలో పూర్తి చేశాడు.
నిరాశ పరచిన భారత్ అథ్లెట్లు
భారత అథ్లెట్లు దుతీ చాంద్, స్వప్నా బర్మన్, మహమ్మద్ అనాస్ యాహియా అభిమానులను నిరాశపరచారు. మహిళల 100 మీటర్ల స్ప్రింట్‌లో దుతీ దారుణంగా విఫలమైంది. స్టీపుల్ ఛేజ్‌లో స్వప్న కూడా ఫ్లాప్ షోను కొనసాగించి, 17 మంది పోటీదారుల్లో 14వ స్థానంలో నిలిచింది. పురుషుల 200 మీటర్ల పరుగులో అనాస్ యాహియా హీట్స్ నుంచే వెనుదిరిగాడు.