క్రీడాభూమి

శ్రీలంక ఎదురీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, ఆగస్టు 5: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌పై టీమిండియా పట్టు బిగిస్తున్నది. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఫాలోఆన్‌కు దిగిన శ్రీలంక మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లకు 209 పరుగులు చేసింది ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించుకోవాలంటే ఈ జట్టు ఇంకా 230 పరుగులు చేయాలి. ఎనిమిది వికెట్లు, రెండు రోజుల ఆట చేతిలో ఉన్నాయి. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌ను 9 వికెట్లకు 622 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా, తీవ్రమైన ఒత్తిడికి లోనైన శ్రీలంక రెండో రోజు ఆటను ముగించే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేసింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను కొనసాగించి, మరో పది పరుగులకే మూడో వికెట్‌ను దినేష్ చండీమల్ రూపంలో కోల్పోయింది. అతను 10 పరుగులు చేసి, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కుశాల్ మెండిస్ 24 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో కోహ్లీకి చిక్కడంతో శ్రీలంక కష్టాల్లో పడింది. వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ నిరోషన్ డిక్‌విల్లా (51) అర్ధ శతకాన్ని మినహాయిస్తే, మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేకపోయారు. మాజీ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ (26), రంగన హెరాత్ (2), దిల్‌రువాన్ పెరెరా (25), మలింద పుష్పకుమార (15 నాటౌట్), నువాన్ ప్రదీప్ (0) పెవిలియన్‌కు క్యూ కట్టడంతో శ్రీలంక ఇన్నింగ్స్‌కు 49.4 ఓవర్లలో 183 పరుగుల వద్ద తెరపడింది. అశ్విన్ 69 పరుగులకు ఐదు వికెట్లు పడగొట్టి, లంక బ్యాటింగ్ ఆర్డర్‌ను దారుణంగా దెబ్బతీశాడు. రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ చెరి రెండు వికెట్లు కూల్చారు. ఇలావుంటే, మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 600 పరుగులు సాధించిన భారత్ ఆతర్వాత శ్రీలంకను మొదటి ఇన్నింగ్స్‌లో 291 పరుగులకు కట్టడి చేసింది. అయితే, ప్రత్యర్థికి ఫాలోఆన్ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ, రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించాలని నిర్ణయించుకున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో వ్యూహం మార్చాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 439 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించిన నేపథ్యంలో, ఫాలోఆన్‌కు దిగాల్సిందిగా లంకను ఆహ్వానించాడు. దీనితో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన లంక కేవలం 7 పరుగుల వద్ద ఉపుల్ తరంగ (2) వికెట్‌ను చేజార్చుకుంది. అతను ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలినప్పటికీ, ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన కుశాల్ మెండిస్‌తో కలిసి ఓపెనర్ దిముత్ కరుణరత్నే జట్టును ఆదుకునే బాధ్యతను తీసుకున్నాడు. వీరిద్దరూ భారత బౌలింగ్‌కు ఎదురీదుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. రెండో వికెట్‌కు 51.5 ఓవర్లలో 191 పరుగులు జోడించిన తర్వాత కుశాల్ మేండిస్ వికెట్ కూలింది. అతను 135 బంతులు ఎదుర్కొని, 17 ఫోర్ల సాయంతో 110 పరుగులు సాధించి, హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహా క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. దిముత్ కరుణరత్నే 200 బంతుల్లో 92 పరుగులు చేసి, మలింద పుష్పకుమార (2)తో కలిసి క్రీజ్‌లో ఉన్నాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లకు 209 పరుగులు చేసిన లంక ఓటమి ఖాయంగా కనిపిస్తున్నది. అయితే, ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించుకోగలుగుతుందా? లేదా? అన్నది చూడాలి. రెండు రోజుల ఆట మిగిలి ఉండడంతో లంక ఈ మ్యాచ్‌ని డ్రా చేసుకోవడం అసాధ్యమే.
చిత్రం.. రవీంద్ర జడేజా బంతికి ధనంజయ డిసిల్వ క్లీన్ బౌల్డ్

స్కోరుబోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: 158 ఓవర్లలో 9 వికెట్లకు 622 డిక్లేర్డ్ (లోకేష్ రాహుల్ 57, చటేశ్వర్ పుజారా 133, అజింక్య రహానే 132, రవిచంద్రన్ అశ్విన్ 54, వృద్ధిమాన్ సహా 67, రవీంద్ర జడేజా 70, రంగన హెరాత్ 4/154, మలింద పుష్పకుమార 2/156.
శ్రీలంక మొదటి ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 20 ఓవర్లలో 2 వికెట్లకు 50): దిముత్ కరుణరత్నే సి అజింక్య రహానే బి అశ్విన్ 25, ఉపుల్ తరంగ సి లోకేష్ రాహుల్ బి అశ్విన్ 0, కుశాల్ మెండిస్ సి విరాట్ కోహ్లీ బి ఉమేష్ యాదవ్ 24, దినేష్ చండీమల్ సి హార్దిక్ పాండ్య బి రవీంద్ర జడేజా 10, ఏంజెలో మాథ్యూస్ సి చటేశ్వర్ పుజారా బి అశ్విన్ 26, నిరోషన్ డిక్‌విల్లా బి మహమ్మద్ షమీ 51, ధనంజయ డి సిల్వ బి రవీంద్ర జడేజా 0, దిల్‌రువాన్ పెరెరా బి అశ్విన్ 25, రంగన హెరాత్ బి మహమ్మద్ షమీ 2, మలింద పుష్పకుమార 15 నాటౌట్, నువాన్ ప్రదీప్ బి అశ్విన్ 0, ఎక్‌స్ట్రాలు 5, మొత్తం (49.4 ఓవర్లలో ఆలౌట్) 183.
వికెట్ల పతనం: 1-0, 2-33, 3-60, 4-64, 5-117, 6-122, 7-150, 8-152, 9-171, 10-183.
బౌలింగ్: మహమ్మద్ షమీ 6-1-13-2, రవిచంద్రన్ అశ్విన్ 16.4-3-69-5, రవీంద్ర జడేజా 22-6-84-2, ఉమేష్ యాదవ్ 5-1-12-1.
శ్రీలంక రెండో ఇన్నింగ్స్ (్ఫలోఆన్): దిముత్ కరుణరత్నే 92 నాటౌట్, ఉపుల్ తరంగ బి ఉమేష్ యాదవ్ 2, కుశాల్ మెండిస్ సి వృద్ధిమాన్ సాహా బి హార్దిక్ పాండ్య 110, మలింద పుష్పకుమార 2 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 3, మొత్తం (60 ఓవర్లలో 2 వికెట్లకు) 209.
వికెట్ల పతనం: 1-7, 2-198.
బౌలింగ్: ఉమేష్ యాదవ్ 9-2-29-1, రవిచంద్రన్ అశ్విన్ 24-6-79-0, మహమ్మద్ షమీ 6-2-13-0, రవీంద్ర జడేజా 16-2-76-0, హార్దిక్ పాండ్య 5-0-12-1.

జడేజా దూకుడు

కొలంబో: భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టెస్టు వికెట్లు సాధించడంలో దూకుడుగా ముందుకు వెళుతున్నాడు. ఈ ఫార్మాట్‌లో 150 వికెట్ల మైలురాయిని అత్యంత వేగంగా చేరిన మొదటి భారత ఎడమచేతి వాటం స్పిన్నర్‌గా రికార్డు సృష్టించాడు. వినూ మన్కడ్ 40, బిషన్ సింగ్ బేడీ 41, రవి శాస్ర్తీ 78 టెస్టుల్లో 150 వికెట్లను పూర్తి చేస్తే, జడేజా తన 32వ టెస్టులో ఈ ఫీట్‌ను సాధించాడు. కాగా, వేగంగా ఈ మైలురాయిని చేరిన రెండో భారత బౌలర్‌గా కూడా అతను రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించాడు. శ్రీలంక మొదటి ఇన్నింగ్స్ ఆడుతున్నప్పుడు ధనంజయ డిసిల్వను బౌల్డ్ చేయడం ద్వారా కెరీర్‌లో 150 టెస్టు వికెట్‌ను అతను సాధించాడు. రవిచంద్రన్ అశ్విన్ 29 టెస్టుల్లో 150 వికెట్లను పూర్తి చేసి అగ్రస్థానంలో ఉన్నాడు. ఎర్రాపల్లి ప్రసన్న, అనిల్ కుంబ్లే తమతమ 34వ టెస్టులో 150 వికెట్ల గమ్యాన్ని చేరుకోగలిగారు. హర్భజన్ సింగ్‌కు ఈ లక్ష్యాన్ని పూర్తి చేయడానికి 35 టెస్టులు అవసరమయ్యాయి.
ఎడమచేతి వాటం బౌలర్లలో 150 వికెట్లను తక్కువ టెస్టుల్లో సాధించిన బౌలర్ కూడా జడేజానే కావడం విశేషం. ఇంతకు ముందు 34 టెస్టుల్లో ఈ ఘనతను అందుకొని మిచెల్ జాన్సన్ నెలకొల్పిన రికార్డును జడేజా బద్దలు చేశాడు. అంతేగాక, టెస్టు చరిత్రలో 150 వికెట్లు కూల్చిన ఎడమచేతి బౌలర్లలో జడేజా 19వ బౌలర్. భారతీయుల్లో ఐదోవాడు.
ఐదు వికెట్ల అశ్విన్
కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐదు వికెట్లు పడగొట్టాడు. ఒక ఇన్నింగ్స్‌లో అతను ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు కూల్చడం ఇది 26వ సారి. అనిల్ కుంబ్లే 35 పర్యాయాలు ఈ ఫీట్‌ను సాధించి, భారత బౌలర్ల జాబితాలో అగ్రస్థానాన్ని ఆక్రమించగా, అశ్విన్ రెండో స్థానానికి చేరాడు. అయితే, వేగంగా 26 పర్యాయాలు ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు కూల్చిన బౌలర్ల జాబితాలో అశ్విన్‌ది మొదటి స్థానం. రిచర్డ్ హాడ్లీ తన 63వ టెస్టులో ఈ ఘనతను అందుకుంటే, అశ్విన్ 51వ టెస్టుల్లోనే ఈ అరుదైన రికార్డును చేరుకున్నాడు.