కృష్ణ

స్వాతంత్య్ర వేడుకల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: జిల్లా పోలీసు పెరేడ్ గ్రౌండ్స్‌లో ఈ నెల 15వతేదీన నిర్వహించనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. పోలీసు పెరేడ్ గ్రౌండ్‌లో జరుగుతున్న ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. శకటాల ప్రదర్శన, మార్చ్ఫిస్ట్‌కు ప్రత్యేకంగా ట్రాక్ సిద్ధం చేయాలన్నారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో గ్రౌండ్ పాడవ్వకుండా క్వారీ డస్ట్‌ను పరచాలన్నారు. ఒకే రంగు షామియానాలను ఏర్పాటు చేయాలని సూచించారు. వేడుకలను తిలకించేందుకు తగిన సంఖ్యలో షామియానాలు, కుర్చీలు ఏర్పాటు చేయాలన్నారు. స్టాల్స్ ఏర్పాటుతో పాటు లబ్ధిదారులకు యూనిట్ల పరికరాల పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. శకటాల ప్రదర్శన సమయంలో ఆయా శాఖల అధికారులు, సిబ్బంది ఏకరూప దుస్తులు ధరించే విధంగా డ్రస్‌కోడ్ అమలు చేయాలన్నారు. స్టాల్స్ ముందు ఒకే రంగులో రిబ్బన్స్‌తో బ్యానర్ ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీవో సాయిబాబు, మున్సిపల్ కమిషనర్ జస్వంతరావు, తహశీల్దార్ నారదముని, ఆర్‌అండ్‌బి ఇఇ మురళీకృష్ణ, ఎఎస్‌పి కె శేఖర్, ఆర్‌ఐ నాగిరెడ్డి తదితరులు ఉన్నారు.