రంగారెడ్డి

హరితహారాన్ని నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్: హరితహారం కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేసిన అధికారులు, ప్రజా ప్రతినిధులపై కఠిన చర్యలు తప్పవని మేడ్చల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎంవి రెడ్డి హెచ్చరించారు. ఘట్‌కేసర్ మండల పరిషత్ సమావేశం హాల్‌లో ఎంపిపి బండారి శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై శుక్రవారం సమీక్షా సమావేశం జరిగింది. గ్రామాల్లో వైకుంఠ ధామం, స్మృతివనం, పార్కు స్థలాలలో మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. గ్రామాలలో ప్రభుత్వ స్థలాలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే మొక్కల పెంపకానికి స్థలాలు కేటాయిస్తామన్నారు. గ్రామాలలో స్వచ్ఛమిషన్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు అమలు చేయాలని, ప్రతి గ్రామం పచ్చదనం, పరిశుభ్రత కలిగి ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలని, బహిరంగ మలవిసర్జన చేసిన వారిపై జరిమానాలు వేయాలని సూచించారు. గ్రామాల్లోని ప్రతి ఇంటిలో స్వచ్ఛమిషన్ పథకంలో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణం జరగాలన్నారు. ప్రతి గ్రామంలో 40 వేల మొక్కలను నాటి సంరక్షించాలన్నారు. గ్రామాలకు కేటాయించిన టార్గెట్‌ను పూర్తి చేయని సర్పంచ్‌లు, కార్యదర్శులు, సభ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి గ్రామాన్ని అకస్మిక తనిఖీలు నిర్వహిస్తామన్నారు. తమ తనిఖీలలో హరితహారం కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేసినట్లు రుజువు అయితే ముందుగా షోకాజ్ నోటీసులు జారి చేస్తామని, అనంతరం చెక్ పవర్ రద్దు, తీరు మారకపోతే సస్పెన్షన్ వంటి కార్యక్రమాలు ఉంటాయన్నారు. నిర్లక్ష్యం చేసిన వారెంతటి వారైన ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ మేడ్చల్ నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి పరిచేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ నిరంతరం సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం నుండి టిడిలు విడుదల కాకపోవటంతో అభివృద్ధి కుంటుపడుతోందని ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి స్పందించి వారంలోగా టిడిలు విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో నిలిపి ఆదర్శంగా నిలిపేందుకు నిరంతరం కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిపిఓ సురేష్‌మోహన్, జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణ, డిఆర్‌డిఏ ప్రాజెక్టు డైరక్టర్ కౌటిల్య, జిల్లా వైద్యాధికారి ఉషారాణి, కీసర ఆర్డీఓ హన్మంత్‌రెడ్డి, మండల ప్రత్యేకాధికారి సత్తార్, ఎంపిపి బండారి శ్రీనివాస్‌గౌడ్, జడ్పీటిసి మంద సంజీవరెడ్డి, అయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, జిల్లా, డివిజన్, మండల, గ్రామస్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.