పంచాంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిథి: 
కృష్ణ అమావాస్య రా.12.02
నక్షత్రం: 
ఆశ్రేష ప.03.53
వర్జ్యం: 
ఉ.06.53 వరకు, రా.03.19 ల 04.51
దుర్ముహూర్తం: 
ప.12.44 ల 01.34, ప.03.14 ల 04.05
మేషం: 
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుండుటచే మానసికానందాన్ని పొందుతారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు.
వృషభం: 
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) కుటుంబంలో సుఖ, సంతోషాలుంటాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యములు ఫలిస్తాయి.
మిథునం: 
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) ఆకస్మిక ధనలాభయోగముంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలుంటాయి. అంతటా అనుకూల వాతావరణమేర్పడుతుంది.
కర్కాటకం: 
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) ఋణప్రయత్నం ఫలిస్తుంది. చెడు సహవాసంవైపు వెళ్లకుండా వుంటే గౌరవం దక్కుతుంది. క్షణికావేశం పనికిరాదు. అనుకోకుండా కుటుంబంలో కలతలేర్పడే అవకాశముంది.
సింహం: 
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) అనారోగ్య బాధలతో సతమతమవుతారు. స్థానచలన సూచనలుంటాయి. నూతన వ్యక్తులు కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుండక మానసికాందోళన చెందుతారు.
కన్య: 
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) నూతన కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు. ఆకస్మిక ధనలాభముంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
తుల: 
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు.
వృశ్చికం: 
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆకస్మిక ధనలాభముంది. రాజకీయ రంగంలోనివారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభించును. అన్నింటా విజయానే్న సాధిస్తారు.
ధనుస్సు: 
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.,) కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం వుంటుంది. వృధా ప్రయాణాలెక్కువ చేస్తారు.
మకరం: 
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం వుంటుంది. వృధా ప్రయాణాలెక్కువ చేస్తారు.
కుంభం: 
(్ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశముంది. ఆర్థిక ఇబ్బందులనెదుర్కొంటారు. అనారోగ్య బాధవలన బలహీనులవుతారు.
మీనం: 
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) పిల్లలవల్ల ఇబ్బందులనెదుర్కొంటారు. అధికారులతో గౌరవింపబడతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తిచేసుకుంటారు. నూతన వ్యక్తులు పరిచయమవుతారు.
Date: 
Monday, August 21, 2017
author: 
- గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి