తెలంగాణ

జిఎస్‌టి సదస్సుకు నివేదికలు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్రప్రభుత్వాలు చేపట్టిన వివిధ సాగునీటి, వౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై వస్తుసేవాపన్ను(జిఎస్‌టి) భారాన్ని ఐదు శాతానికి తగ్గించాలన్న డిమాండ్‌ను బలంగా వినిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై జిఎస్‌టిని 18నుంచి 12శాతానికి తగ్గించడం వల్ల ఉపయోగం లేదని, ఐదు శాతానికి తగ్గించాలని తెలంగాణతో సహా దేశంలో వివిధ రాష్ట్రాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. సెప్టెంబర్ 9న జిఎస్‌టి మండలి సమావేశం హైదరాబాద్‌లో జరగనుంది. ఈ సమావేశంలో తమ రాష్ట్రాలపై పడుతున్న భారాన్ని వివరించేందుకు తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, మహారాష్టత్రో సహా పలు రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఇతర వౌలిక సదుపాయాల ప్రాజెక్టులు డబుల్ బెడ్‌రూం ఇండ్లపై ఇప్పటికే బడ్జెట్‌లో నిధులను కేటాయించి అమలు చేస్తున్నారు. వీటిపై జిఎస్‌టి భారం రూ.19వేల కోట్లు పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయల పైబడి ఖర్చుతో ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్మిస్తోంది. హౌసింగ్ సెక్టార్‌లో రూ.18వేల కోట్ల నిధులతో నిర్మాణాలను చేపట్టారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, రోడ్లుభవనాలు, పంచాయితీరాజ్‌లో దాదాపు రూ.30వేల కోట్ల నిధులతో పనులను చేపట్టారు. ప్రాజెక్టుల వారీగా పడే భారంపై రాష్ట్ర ఆర్థిక శాఖ నివేదికలను సిద్ధం చేస్తోంది. కేంద్రం జిఎస్‌టి భారాన్ని ఐదు శాతానికి తగ్గించని పక్షంలో సంక్షేమ పథకాలను పునస్సమీక్షించే పరిస్థితి తలెత్తుతుందని ఆర్థిక నిపుణులంటున్నారు. రాష్ట్రప్రభుత్వం ప్రత్యక్షంగా, పరోక్షంగా సంక్షేమ పథకాలపై దాదాపు రూ. 40వేల కోట్ల నిధులను ఖర్చుపెడుతోంది. కేంద్రం మొండిగా వ్యవహరించే పక్షంలో సంక్షేమ పథకాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై జిఎస్‌టిని ఐదు శాతానికి తగ్గించాలని కోరుతున్న చాలా రాష్ట్రాలను కలుపుకుని తన వాణిని బలంగా వినిపించాలని రాష్ట్రప్రభుత్వం యోచిస్తోంది.
ఈ దిశగా ఏ ప్రాజెక్టుపై ఎంత భారం పడుతుంది, దీని వల్ల తలెత్తే పరిణామాలపై శాఖలవారీగా నివేదికలను తయారు చేసే పనిని పూర్తి చేస్తోంది. మూడేళ్ల క్రితమే అవతరించిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాలతో పోల్చేందుకు వీలు లేదు. కేంద్రం ఇతోధికంగా రాష్ట్రాన్ని ఆదుకునేందుకు ముందుకు రావాల్సి ఉందని ఇప్పటికే మంత్రి కె తారకరామారావు ఢిల్లీలో జరిగిన జిఎస్‌టి సమావేశంలో తేల్చి చెప్పారు.
కాగా రాష్ట్రంలో జిఎస్‌టి చెల్లించేందుకు వీలుగా 2.5 లక్షల మంది డీలర్లు తమ సంస్థల పేర్లను నమోదు చేసుకున్నారు. 99శాతం జిఎస్‌టి పన్ను 34,236ట్రేడర్ల నుంచి వసూలవుతుందని జిఎస్‌టి శాఖ గుర్తించింది. వస్తు సేవా పన్ను కింద ఇంతవరకు రాష్ట్రంలో రూ. 2609 కోట్ల మేర పన్ను ఆదాయం వచ్చింది. ఇందులో రాష్ట్ర జిఎస్‌టి వాటా రూ. 781 కోట్లు, సమగ్ర జిఎస్‌టి రూ..878కోట్లు, కేంద్ర జిఎస్‌టి కింద రూ.505కోట్లు వసూలు అయ్యాయి. కాగా అదనంగా రూ. 444కోట్ల సెస్ వసూలైంది. దేశ వ్యాప్తంగా జిఎస్‌టి ఇంతవరకు రూ. 60 వేల కోట్లు వసూలు కాగా ఇందులో తెలంగాణ వాటా రూ.. 3వేలకోట్లని జిఎస్‌టి శాఖ వర్గాలు తెలిపాయి.