క్రీడాభూమి

వీనస్ రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్: ఒక గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ ఈవెంట్ మహిళల సింగిల్స్‌లో మార్టినా నవ్రతిలోవా (1994) తర్వాత సెమీ ఫైనల్స్ చేరిన ఎక్కువ వయసుగల క్రీడాకారిణిగా అమెరికా స్టార్ వీనస్ విలియమ్స్ రికార్డు సృష్టించింది. యుఎస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్‌లో ఆమె రెండు పర్యాయాలు వింబుల్డన్ టైటిల్‌ను సాధించిన పెట్రా క్విటోవాను 6-3, 3-6, 7-6 తేడాతో ఓడించింది. 37 ఏళ్ల వయసులోనూ యువ క్రీడాకారిణులతో పోటీపడుతూ, మూడోసారి యుఎస్ టైటిల్‌ను అందుకునే దిశగా మరో అడుగు ముందుకేసింది. ఫైనల్‌లో స్థానం కోసం ఆమె తన దేశానికే చెందిన స్లొయేన్ స్టెఫెన్స్‌ను ఢీ కొంటుంది. మరో క్వార్టర్ ఫైనల్‌లో స్టెఫెన్స్ 6-3, 3-6, 7-6 తేడాతో 16వ సీడ్ అనస్టాసిజా సెవత్సొవాపై విజయం సాధించింది. ఈ ఏడాది వింబుల్డన్‌తో మళ్లీ తన ప్రస్థానాన్ని మొదలు పెట్టడానికి ముందు స్టెఫెన్స్ సుమారు 11 నెలలు కాలి గాయం కారణంగా టెన్నిస్‌కు దూరమైంది. అయితే, పునరాగమనంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫామ్‌ను కొనసాగిస్తున్నది.
సెమీస్‌కు ఆండర్సన్
దక్షిణాఫ్రికా ఆటగాడు కెవిన్ ఆండర్సన్ యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో సెమీ ఫైనల్స్ చేరాడు. ప్రస్తుతం 28వ ర్యాంక్‌లో ఉన్న అతను క్వార్టర్ ఫైనల్‌లో 17వ సీడ్ శామ్ క్వెర్రీని 7-6,6-7, 6-3, 7-6 తేడాతో ఓడించాడు. చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో ఇరువురు క్రీడాకారులు సర్వశక్తులు ఒడ్డారు. చివరికి, అతి కష్టం మీద మ్యాచ్‌ని తన ఖాతాలో వేసుకున్న ఆండర్సన్ సెమీస్‌లో పాబ్లో కారెనో బస్టాతో పోరును ఖాయం చేసుకున్నాడు. 12వ సీడ్ బస్టా 6-4, 6-4, 6-2 ఆధిక్యంతో డిగో స్వార్ట్‌జ్మన్‌ను ఓడించాడు.