క్రీడాభూమి

కామనె్వల్త్ వెయిట్‌లిఫ్టింగ్‌లో మూడో రోజు 3 స్వర్ణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో జరుగుతున్న కామనె్వల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్స్‌లో మూడో రోజు, బుధవారం భారత్‌కు మూడు స్వర్ణాలుసహా మొత్తం 10 పతకాలు లభించాయి. యూత్ బాయిస్ విభాగంలో ముతుపండి రాజా మొత్తం 260 కిలోల బరువునెత్తి విజేతగా నిలిచాడు. ఎర్రా దీక్షిత జూనియర్ మహిళల 58 కిలోల విభాగంలో 167 కిలోల బరువును ఎత్తి స్వర్ణాన్ని అందుకుంది. దీపక్ లాథర్ జూనియర్ బాలుర 69 కిలోల విభాగంలో 295 కిలోల బరువుతో అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. అతనికి సీనియర్స్ విభాగంలో కాంస్య పతకం లభించడం విశేషం. అదే విధంగా ముతుపండి రాజా జూనియర్ విభాగంలో రజత పతకాన్ని కూడా సాధించాడు.
పవర్‌లిఫ్టింగ్‌కు జట్టు ఎంపిక
పొచెఫ్‌స్ట్రూమ్‌లో ఈనెల 10 నుంచి 17వ తేదీ వరకు జరిగే కామనె్వల్త్ పవర్‌లిఫ్టింగ్, బెంచ్‌ప్రెస్ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొనే 23 మందితో కూడిన జట్టు ఎంపికైంది. గత ఏడాది జంషెడ్యూర్‌లో జరిగిన సుబ్రతా ఇంటర్నేషనల్ క్లాసిక్‌లో కాంస్యం, గత నెల ఢిల్లీలో జరిగిన రాష్ట్ర స్థాయి పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో రజత పతకాన్ని అందుకున్న మోహిత్ సూరికి పతకం సాధించే అవకాశాలు ఉన్నాయి.