క్రీడాభూమి

ఈ సీజన్‌కు ముర్రే దూరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, సెప్టెంబర్ 6: యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ నుంచి గాయం కారణంగా వైదొలగిన ప్రపంచ రెండో ర్యాంక్ ఆటగాడు ఆండీ ముర్రే ఈ సీజన్ చివరి వరకూ అందుబాటులో ఉండే అవకాశం కనిపించడం లేదు. ఫిట్నెస్ సమస్యను ఎదుర్కొంటున్న ముర్రే శస్త్ర చికిత్స కంటే విశ్రాంతికే ఎక్కువ మొగ్గు చూపాడని సమాచారం. నిపుణుల పర్యవేక్షణలో క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతోపాటు ఎప్పటికప్పుడు వైద్యుల సూచనలు తీసుకోవడం ద్వారా మళ్లీ ఫిట్నెస్ సంపాదించాలన్నది అతని అభిప్రాయంగా కనిపిస్తున్నది. దురదృష్టవశాత్తు యుఎస్ ఓపెన్‌కు దూరం కావాల్సి వచ్చిందని ముర్రే ఒక ప్రకటనలో తెలిపాడు. రానున్న బీజింగ్, షాంఘై ఓపెన్ టోర్నీల్లోనూ తాను ఆడబోవడం లేదని స్పష్టం చేశాడు. సీజన్ చివరిలో వియన్నా, పారిస్ టోర్నీలున్నాయని అన్నాడు. వాటిలో ఆడే విషయంపై తనకు ఇంకా స్పష్టత లేదన్నాడు. బహుశా ఆ రెండు టోర్నీల్లోనూ పాల్గొనలేకపోవచ్చని అనుమానం వ్యక్తం చేశాడు. దీనిని బట్టి చూస్తే, ముర్రే వచ్చేని వచ్చే ఏడాదిలోగా మ్యాచ్‌ల్లో చూడడం సాధ్యం కాదనిపిస్తున్నది.