క్రీడాభూమి

తలైవాస్‌ను గెలిపించిన ఠాకూర్ రైడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోనేపట్, సెప్టెంబర్ 13: అజయ్ ఠాకూర్ చివరి క్షణాల్లో చేసిన రైడ్ ద్వారా ఫుల్ పాయింట్లు లభించడంతో, యుపి యోద్ధతో చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన ప్రో కబడ్డీ లీగ్ మ్యాచ్‌లో తమిళ తలైవాస్ విజయం సాధించింది. నితిన్ తోమర్ (14 పాయింట్లు), రిషాంక్ దేవాడిగ (8 పాయింట్లు), నితేష్ కుమార్ (5 పాయింట్లు) రాణించడంతో యుపి యోద్ధ ప్రారంభం నుంచి గట్టిపోటీనిచ్చింది. సెకండ్ హాఫ్‌లోనూ పోరాటాన్ని కొనసాగించి, ఒకానొక దశలో విజయంపై అభిమానులకు ఆశలు రేపింది. కానీ, చివరిలో ఠాకూర్ రైడ్ తలైవాస్‌ను గెలిపించింది. అతను మొత్తం 8 పాయింట్లు చేశాడు. ప్రపంజన్ కూడా ఎనిమిది పాయింట్ల తన ఖాతాలో వేసుకున్నాడు. అమిత్ హూడా నాలుగు పాయింట్లు చేయగలిగాడు. మొత్తం మీద ఈ మ్యాచ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.
హర్యానా చిత్తు
పునేరీ పల్టన్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ చిత్తయింది. పునేరీ పల్టన్ 38 పాయింట్లు సాధించింది. దీపక్ హూడా 13 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలవగా, సందీప్ నర్వాల్ 8 పాయింట్లు చేశాడు. హర్యానా ఆటగాల్లలో దీపక్ దలియా 11 పాయింట్లు సాధించాడు. అయితే, మిగతా వారు విఫలం కావడంతో, 22 పాయింట్లకే పరిమితమైన హర్యానాకు ఓటమి తప్పలేదు.