తెలంగాణ

తెలంగాణ పోరాట స్ఫూర్తి ప్రతి తరానికి తెలియాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 16: తెలంగాణ పోరాట స్ఫూర్తి, చరిత్ర నేటి తరానికే కాకుండా ప్రతి తరానికి తెలియాల్సిన అవసరం ఉందని రాష్ట్ర సాహిత్య అకాడమి అధ్యక్షుడు డాక్టర్ నందిని సిధారెడ్డి అన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించాలన్న ఉద్దేశ్యంతోనే పలువురు జీవిత చరిత్రను పాఠ్యాంశాలుగా నేటి తరానికి తెలియజేయడం జరుగుతుందని అన్నారు. శనివారం నాడిక్కడ రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో తెలంగాణ రాష్ట్ర అమరవీరుల ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆట-పాట-మాట కార్యక్రమాన్ని ప్రారంభించి సిధారెడ్డి ప్రసంగించారు. తెలంగాణ మట్టిలో ఉన్న ప్రత్యేకత ప్రజలను అవసరం వచ్చినప్పుడల్లా పోరాటం వైపు నెట్టుతుందని అన్నారు. సిఎం కార్యాలయంలో ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం లేకుండా ప్రత్యేక రాష్ట్ర పోరాటం ఉండదని అన్నారు. తెలంగాణ సమాజానికి నిరంతరంగా పోరాడే లక్షణాన్ని నాటి రైతాంగ పోరాటం ఇచ్చిందని తెలిపారు. తెలంగాణ పోరాట యోధుల గురించి ప్రపంచానికి తెలియజేయడం కోసం రానున్న ప్రపంచ తెలుగుమహాసభల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. అనంతరం 69 మంది కవులతో కవి సమ్మేళనం నిర్వహించారు. తెలుగు వర్శిటీ ఉపాధ్యక్షుడు ఎస్‌వి సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

చిత్రం..శనివారం హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర అమరవీరుల ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆట-పాట-మాట కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగిస్తున్న సాహిత్య అకాడెమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి