తెలంగాణ

వైద్యుడిపై కాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరంలో సోమవారం సాయంత్రం కాల్పుల కలకలం చెలరేగింది. ఇద్దరు డాక్టర్ల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు తావిచ్చి కాల్పులకు తెరలేపింది. ఒక డాక్టర్‌పై మరో డాక్టర్ కాల్పులకు పాల్పడిన సంఘటన హిమాయత్‌నగర్‌లో సంచలనమైంది. ఘటనలో గాయపడిన వైద్యుడు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మాదాపూర్‌లోని లారెల్ ఆసుపత్రి డైరెక్టర్ల సమావేశంలో జరిగిన గొడవే కాల్పుల ఘటనకు కారణమని తెలుస్తోంది. కాల్పుల ఘటనతో హిమాయత్‌నగర్ ప్రజలు బెంబెలెత్తిపోయారు. నగరానికి చెందిన డాక్టర్ శశికుమార్, డాక్టర్ ఉదయ్‌కుమార్, డాక్టర్ సాయికుమార్ ముగ్గురు వైద్యులు కలసి మాదాపూర్‌లో లారెన్స్ ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. ఆసుపత్రిలో డాక్టర్ శశికుమార్ రూ. 75 లక్షలు పెట్టుబడి పెట్టగా, ఉదయ్, సాయికుమార్‌లు మూడు కోట్లు పెట్టుబడి పెట్టారు. కాగా ఉదయ్‌కుమార్ ఓ ఎన్‌ఐఆర్‌ను ఆసుపత్రిలో భాగస్వామిని చేస్తూ కొంత పెట్టుబడి పెట్టించాడు. దీంతో శశికుమార్ ఎన్‌ఆర్‌ఐ భాగస్వామిని ఒప్పుకోలేదు. కాగా వీరు సోమవారం సాయంత్రం హిమాయత్‌నగర్‌లోని బ్లూఫాక్స్ హోటల్‌లో సమావేశమయ్యారు. ముగ్గురు భాగస్వాములై ఉండగా మరో వ్యక్తి ఎందుకంటూ డాక్టర్ శశికుమార్, ఉదయ్‌కుమార్‌ను నిలదీశారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. హోటల్‌లో వాగ్వాదం మంచిది కాదంటూ ముగ్గురు కలసి కారులో హిమాయత్‌నగర్ వైపు వెళ్లారు. డాక్టర్ ఉదయ్ డ్రైవ్ చేస్తుండగా శశికుమార్ తన వద్దనున్న .32 రివాల్వర్‌తో ఉదయ్‌పై కాల్పులు జరిపాడు. డాక్టర్ ఉదయ్ డోర్ తెరచుకొని కారులోంచి దిగిపోయి ఆటోలో సమీపంలోని అపోలో ఆసుపత్రికి వెళ్లారు. కారులోని శశికుమార్, సాయికుమార్ అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న సెంట్రల్ జోన్ డిసిపి కమలాసన్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు జరుపుతున్నారు. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డాక్టర్ ఉదయ్‌కుమార్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. కాల్పుల ఘటనపై విచారణ చేపడతామని, పరారీలోని నిందితులను పట్టుకునేందుకు నాలుగు బృందాలను రంగంలోకి దించామని డిసిపి తెలిపారు.

చిత్రం... కాల్పులు చోటుచేసుకున్న కారును పరిశీలిస్తున్న డిసిపి కమలాసన్ రెడ్డి