తెలంగాణ

అండమాన్‌లో బేటీ బచావో బేటీ పడావో సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 9: అండమాన్ నికోబార్‌లో అక్టోబర్ 10 నుండి 14 వరకు జరిగే ‘బేటీ బచావో బేటీ పడావో’ జాతీయ సదస్సులో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్‌పర్సన్ రాగం సుజాత నాగేందర్ మంగళవారం వెళుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళల సంక్షేమం, అభివృద్ధి కోసం చేపడుతున్న వివిధ కార్యక్రమాలపై ఆమె ఈ సందర్భంగా వివరిస్తారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఒంటరిమహిళలకు పింఛన్, బాలికల విద్య, శిశుసంరక్షణ, కెసిఆర్ కిట్స్ తదితర పథకాల గురించి ఆమె వివరిస్తారని అధికారికంగా వెల్లడించారు. ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పథకాన్ని ఈ అవగాహనా సదస్సులో ఆవిష్కరిస్తారు.