క్రీడాభూమి
కామనె్వల్త్ షూటింగ్లో మెరిసిన సిద్ధు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బ్రిస్బేన్, అక్టోబర్ 31: ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో జరుగుతున్న కామనె్వల్త్ షూటింగ్ చాంపియన్‌షిప్స్‌లో హీనా సిద్ధు మరోసారి సత్తా చాటుకుంది. 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ ఈవెంట్లో మంగళవారం ఆమె పసిడి పతకాన్ని కైవసం చేసుకుని భారత్‌కు అద్భుతమైన శుభారంభాన్ని ఇచ్చింది. ఈ ఈవెంట్లో సిద్ధు మొత్తం 626.2 (386+240.8) పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ టోర్నీ మిక్స్డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ ఈవెంట్ ఫైనల్లో జీతూ రాయ్‌తో కలసి స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న సిద్ధుకు అంతర్జాతీయ పోటీల్లో ఇది వరుసగా రెండో పసిడి పతకం. కామనె్వల్త్ షూటింగ్ చాంపియన్‌షిప్స్‌లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఇతర భారతీయుల్లో దీపక్ కుమార్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన గగన్ నారంగ్ ఈ ఈవెంట్లో నాలుగో స్థానంతో సరిపుచ్చుకోగా, భారత్‌కు చెందిన మరో షూటర్ రవికుమార్ ఐదో స్థానంలో నిలిచాడు.
చిత్రం..హీనా సిద్ధు