Others

అభివృద్ధిని చూడగలగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నైవేలీలో విద్యార్థులు, తల్లిదండ్రుల సమావేశంలో అక్కడ నైవేలీ సి.ఎం.డి. హ్యూమన్ రిసోర్స్ డైరెక్టర్ కోల్‌సెక్రటరీ వచ్చినప్పుడు ఓ 15 మందిని సైట్‌పైన అకస్మాత్తుగా ఇంటర్వ్యూ చేశారు. చెన్నై, ఢిల్లీ ప్రతిష్టాత్మకమైన ఐఐటీలో ప్రముఖ సంస్థల్లో చదివామని, మేమంతా తెలుగువారమని, కోల్ సెక్రటరీకి చెప్పారు.
ఉపాధ్యాయుడికి తరగతి గది బోధనా కార్యక్రమం కోసమే కాదు. ఉపాధ్యాయుడు చేసిన పని సమాజానికి ఎంతవరకు ఉపయోగపడ్డదీ సమీక్ష చేసుకోవాలి. కొన్ని దేశాల్లో మాత్రమే ఈ రకంగా సమీక్ష చేసుకో గలుగుతున్నారు. ఫిన్లాండ్‌లో ఒక ఉపాధ్యాయుడు తన అనుభవాలు రాస్తూ బాధపడ్డాడు. ‘ప్రపంచంలో అత్యున్నత స్కూళ్లు నిర్మించుకున్నాం. కానీ, మా చదువులో అడవిలో కాసిన వెనె్నలై పోయింది కదా!’ అని ఆ టీచర్ ఆవేదన పడ్డాడు. తరగతి గదిలో చెప్పిన చదువు సమాజానికుపయోగపడితే ఉపాధ్యాయుడు ఆనందిస్తాడు. ఇవాళ నైవేలీ లిగ్నైట్‌లో వాకింగ్ చేస్తుంటే సుమారు వేల మంది ఇళ్లు, వాళ్ల పిల్లలు చదువుకై యాజమాన్యం పెట్టిన స్కూళ్లు బాగున్నాయి.
మినీ ఇండియాగా పిలువబడే ఆ లిగ్నైట్ ప్రాంతంలో శ్రామికులైన ఆ పిల్లలు చదువుకుని ఈ వాతావరణంలోనే పెరిగి అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం సంపాదించి తిరిగి సమాజానికి ఆ జ్ఞానం అందించగలగటమే నైవేలీ లక్ష్యమని అక్కడి ఉన్నతాధికారులు చెప్పటం నాకు సంతోషమైంది.
మా వనరులలో విద్యుత్ ఉత్పత్తి కావచ్చును. ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి. వీటన్నింటికి మించి ఈ శ్రామికుల పిల్లలకు చదువు వలన వారి కుటుంబాలలో దీపం వెలిగితే ఈ సంస్థను వారు తమ ఆరాధ్య దైవంగా చూస్తారు. ఈ సంస్థ మాది అని గర్వంగా నిలుస్తారు. యాజమాన్యం కోరేది ఉత్పత్తి మాత్రమే కాదు, ఈ వ్యవస్థ నాది అని సొంతం చేసుకుని నిలిచే శక్తులుగా వారు మారాలి. ఈ ప్రాంతంలో స్కూళ్లు నిర్వహించటం వలన ఆ వాతావరణం వచ్చిందని ఉన్నతాధికారులంటున్నారు. వృత్తిలో ఎన్ని వొడిదుడుకులు వచ్చినా ఇంట్లో తమ పిల్లలు చదువుల్లో వెలగటం చూసి ఆ శ్రామికులు గుండె ధైర్యంతో నిలుస్తారు. తరగతి గదికి ప్రతిభను వెలికితీయటం ఎంత ప్రధానమో, సామాజికీకరణ కూడా అంతే ప్రధానం. ఫిన్లాండ్ ఉపాధ్యాయుల క్షోభ ఏ దేశంలో ఉపాధ్యాయుల బాధపడకూడదు.

-డా.చుక్కా రామయ్య