తెలంగాణ

రోడ్డు మీద రోడ్డు.. కుంగుతున్న భవనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 19: రోడ్డుమీద రోడ్డు వేస్తుండటంతో రాష్ట్ర రాజధానితో పాటు తెలంగాణలోని ఇతర నగరాలు, పట్టణాల్లో ఒకవైపు రోడ్ల ఎత్తు ఏయేటికాయేడు పెరిగిపోతుండగా, మరోవైపు రోడ్లపక్కనే ఉన్న ఇళ్లు, వాణిజ్య, వ్యాపార సముదాయ భవనాలు రోడ్డుకంటే కిందకు వెళ్లిపోతున్నాయి. 30-40 ఏళ్ల క్రితం నిర్మించిన భవనాలు అప్పట్లో రోడ్డుకంటే రెండు నుండి నాలుగైదు ఫీట్ల పైబాగాన ఉండేవి. రోడ్లు మరమ్మతు చేయడంతోపాటు తరచూ ప్రజాప్రతినిధుల సిఫార్సుల మేరకు రోడ్లపై రోడ్లు వేస్తున్నారు. దాంతో చాలాచోట్ల గత 30-40 సంవత్సరాల్లో రోడ్ల ఎత్తు ఐదు అడుగుల నుండి ఎనిమిది అడుగుల వరకు కూడా పెరిగింది. శాస్ర్తియ విధానమంటూ ఏదీ లేకపోవడమే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. ఒకసారి రోడ్డు వేస్తే, దాని జీవిత కాలం ఎంత అన్న ప్రశ్నకు రోడ్లుభవనాల శాఖతోపాటు ఎవరు కూడా సరైన సమాధానం ఇవ్వడం లేదు. జిహెచ్‌ఎంసి, వివిధ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల అధీనంలోని రోడ్లతోపాటు రోడ్లు భవనాల శాఖ, పంచాయితీరాజ్ అధీనంలో ఉన్న రోడ్లకు తరచూ మరమ్మతులు చేస్తున్నారు. అలాగే రోడ్డుపై రోడ్డు వేస్తున్నారు. హైదరాబాద్‌లోని అబిడ్స్, అసెంబ్లీ తదితర ప్రాంతాల్లో ఇటీవల వేర్వేరు పనులకోసం రోడ్లను తవ్వగా, 10 నుండి 20 పొరల వరకు తారు, సిమెంట్‌రోడ్ల పొరలు కనిపిస్తున్నాయి. ఈ పెరుగుదల ఏదో ఒకచోట ఆగేందుకు వీలు కాదా అన్న ప్రశ్న ఉద్భవిస్తోంది. ఇప్పటివరకు రోడ్లపై రోడ్లు వేసుకుంటూనే పోతున్నారు తప్ప, దీనివల్ల మంచి, చెడు జరుగుతున్నాయా అని సంబంధిత శాఖల అధికారులు సమీక్షించడం లేదని స్పష్టమవుతోంది. ఒకసారి తారు రోడ్లు, సిమెంట్ రోడ్లు వేసిన తర్వాత వర్షాలు వస్తే ఆ రోడ్డు కొట్టుకుపోవడం, గుంతలు పడటం జరుగుతోంది. అలాంటిరోడ్డుపై మళ్లీ మళ్లీ రోడ్డు వేస్తూ పోతున్నారు తప్ప నాణ్యతపై దృష్టి కేంద్రీకరించడం లేదు. కంటోనె్మంట్, డిఫెన్స్ ప్రాంతాలతోపాటు రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పరిధిలో వేసిన రోడ్లు పదిసంవత్సరాలు అంతకు ఎక్కువ కాలమైనా చెడిపోవడం లేదు, గుంటలు పడటం లేదు.. కాని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, ఆర్ అండ్ బి, పంచాయితీరాజ్ పరిధిలో వేస్తున్న రోడ్లు ఏడాది తిరగకముందే చెడిపోతున్నాయి. నాణ్యత లేకపోవడం, నాణ్యతా పరీక్షలు సంబంధిత అధికారులు సరిగ్గా చేయకపోవడమే కారణమని తెలుస్తోంది.