తెలంగాణ

ఘనంగా కెసిఆర్ జన్మదినం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 62వ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద ఎత్తున క్యాంపు కార్యాలయానికి తరలివచ్చారు. ముఖ్యమంత్రి కెసిఆర్ దంపతులు ఈ సందర్భంగా రాజ్‌భవన్‌కు వెళ్లగా, గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ దంపతులు సాదరంగా ఆహ్వానించి పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తన కుటుంబ సభ్యులతో కలిసి జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మగుడికి వెళ్లి ముఖ్యమంత్రి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో డబుల్ బెడ్‌రూమ్ ఆకృతిలో ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను ముఖ్యమంత్రి కోశారు. అంతకుముందు క్యాంపు కార్యాలయానికి ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీతో పాటు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డిజిపి అనురాగశర్మతో పాటు ఉన్నతాధికారులు వచ్చి ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో ఎంపి కేశవరావు, శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, జూపల్లి కృష్ణారావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇటీవల టిఆర్‌ఎస్‌లో చేరిన ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు ఉన్నారు.

జన్మదినం సందర్భంగా జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడిలో దర్శనం చేసుకుని వస్తున్న తెలంగాణ సిఎం కెసిఆర్. కెసిఆర్‌కు కేక్ తినిపిస్తున్న
కె.కేశవరావు, ఎర్రబెల్లి