తెలంగాణ

పంచాయతీలకు కొత్త కార్యాలయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 1000 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణంతో పాటు 1064 అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణానికి ఈ బడ్జెట్‌లోనే నిధులు కేటాయించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి కె తారకరామారావు అధికారులను ఆదేశించారు. బడ్జెట్ ప్రతిపాదనలపై రాజేంద్రనగర్‌లోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో బుధవారం సంబంధిత శాఖాధిపతులతో మంత్రి కెటిఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. గత బడ్జెట్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి కేటాయించిన నిధులు, ఎన్నింటినీ ఖర్చు చేశారు, ఈసారి బడ్జెట్‌లో ఎన్ని నిధులు అవసరం అవుతాయనే అంశాలపై మంత్రి అధికారులతో చర్చించారు. ఈసారి బడ్జెట్‌లో గ్రామీణ ప్రాంతాల్లోని వంతెనలకు, బిటి రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. ప్రస్తుతం ఉన్న పంచాయతీరాజ్ రోడ్లను అవసరమైన చోట విస్తరించాలని, అలాగే రోడ్ల నిర్మాణంలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలని మంత్రి సూచించారు. దీంట్లో భాగంగా కోల్డ్‌మిక్స్, ఆర్ బిఐ 81 వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని మంత్రి అన్నారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ పనులను డిజిటలైజ్ చేసేందుకు ఆన్‌లైన్ మానిటరింగ్ టూల్‌ను రూపొందించాలని మంత్రి కెటిఆర్ ఆదేశించారు. గ్రామీణ మంచినీటి సరఫరా కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మిషన్ భగీరథ పథకానికి అవసరమైన నిధులతో ప్రతిపాదనలు రూపొందించాలని మంత్రి ఆదేశించారు. స్వచ్ఛ తెలంగాణలో భాగంగా ఏడు లక్షల 55 వేల టాయిలెట్స్ నిర్మాణానికి సైతం గతంలో కంటే ఎక్కువ నిధులు కేటాయించాలని మంత్రి సూచించారు. గ్రామీణాభివృద్ధిశాఖలో ప్రధానంగా ఉపాధి హామీ, సెర్ఫ్ పథకాల పురోగతిని మంత్రి సమీక్షించారు. గ్రామ జ్యోతిలో దత్తత తీసుకున్న గ్రామాలలో అన్ని రంగాలలో ఉపాధి హామీ పనులను చేపట్టనున్నట్టు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితా రాంచంద్రన్ తెలిపారు. ఈ సందర్భంగా సెర్ఫ్ డైరీని మంత్రి కెటిఆర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై
అధికారులతో సమీక్షిస్తున్న తెలంగాణ మంత్రి కెటిఆర్