తెలంగాణ

ఎన్నారై కోటా పేరిట మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 7: ఎన్నారై కోటాలో మెడికల్, ఇంజనీర్ సీట్లు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడుతోన్న ఓ బోగస్ సంస్థ నిర్వాహకుడిని నార్త్‌జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి వివిధ కళాశాలలకు చెందిన బ్రోచర్లు, మెడికల్, ఇంజనీర్, వెటర్నరీ కోర్సులకు సంబంధించిన అడ్మిషన్ ఫారాలు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ‘కెరీర్స్ గేట్‌వే’ను సీజ్ చేశారు. రూ. 5.5లక్షల నగదుతోపాటు, కంప్యూటర్లు, ప్రింటర్, రబ్బరు స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం టాస్క్ఫోర్స్ నార్త్‌జోన్ డీసీపీ పి రాధాకిషన్ రావు తెలిపిన కథనం ప్రకారం..నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లికి చెందిన అరగొండ అరవింద్ అలియాస్ అరవింద్ గుప్త, ఎంటెక్ చదివాడు. హైదరాబాద్ పరిసరాల్లోని పలు కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ ఓల్డ్‌బోయిన్ పల్లి, సికిందరాబాద్‌లో నివాసముంటున్నాడు.
బిటెక్ విద్యార్థులకు ట్యూషన్లు చెబుతూ, ఎంబిబిఎస్, ఇంజనీర్ అడ్మిషన్లపై పరిజ్ఞానాన్ని సంపాదించాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో వివిధ కళాశాలలకు చెందిన ఎంసెట్ రాసిన విద్యార్థుల వివరాలు సేకరించాడు. అక్రమంగా డబ్బులు సంపాదించాలని దురాశతో బేగంపేట్‌లో కెరీర్ గేట్‌వే, అపెక్స్, నోబెల్ అండ్ గ్లోబల్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీల పేరుతో కార్యాలయాలు తెరిచాడు. టెలికాలర్స్‌ను నియమించుకుని, దేశ, విదేశాల్లోని వివిధ విశ్వవిద్యాలయాల యాజమాన్యాలతో తనకు పరిచయం ఉందని, ఎన్నారై కోటాలో మెడికల్, ఇంజనీర్ సీట్లు ఇప్పిస్తానంటూ విద్యార్థులను నమ్మబలికాడు. పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చాడు.
దీంతో నమ్మిన కొంత మంది విద్యార్థుల వద్ద నుంచి రూ. 3లక్షల నుంచి 15 లక్షల వరకు వసూలు చేశాడు. మెడికల్ సీట్, ఇంజనీర్, వెటర్నరీ సైన్స్‌లో సీట్లు ఇప్పించకపోవడమే కాకుండా నిర్లక్ష్యం వహిస్తుండడంతో గత అక్టోబర్ 16న దిలీప్ కుమార్ అనే విద్యార్థి బేగంపేట్ పోలీసుకు ఫిర్యాదు చేశాడు. అదేవిధంగా బండారు శ్రీనివాస్ అనే మరో విద్యార్థి కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బేగంపేట్‌లోని కెరీర్స్ గేట్‌వే ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీపై దాడి చేసి నిర్వాహకుడు అరవింద్ గుప్తాను అరెస్టు చేశారు.
అరవింద్ గుప్త నగరంలో మూడు ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలను స్థాపించి ప్రముఖ కళాశాలల్లో మెడికల్, ఇంజనీర్ సీట్లు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడుతున్నట్టు విచారణలో తేలింది. ఇప్పటి వరకు అరవింద్ గుప్తపై జూబ్లిహిల్స్, పంజగుట్ట, ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్‌లతోపాటు సికిందరాబాద్ బేగంపేట్ పోలీస్ స్టేషన్లలో 21 కేసులు నమోదై ఉన్నట్టు డీసీపీ రాధాకిషన్‌రావు పేర్కొన్నారు. నిందితుడిపై 406,420, సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం బేగంపేట్ పోలీసులకు అప్పగించారు.