తెలంగాణ

బీజేపీ తదుపరి లక్ష్యం తెలంగాణే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి, డిసెంబర్ 10: తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచే సే లక్ష్యంగా 2018 జనవరి నుండి కార్యాచరణ చేపడుతున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాయగిరి గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన పార్టీ జిల్లా కార్యవర్గ, పదాధికారుల సమావేశంలో పాల్గొనేందుకు విచ్చేసిన డాక్టర్ లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. గుజరాత్ ఎన్నికల అనంతరం తమ పార్టీ గురి తెలంగాణ రాష్ట్రంపైనే ఉందన్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్భ్రావృద్ధికోసం కేంద్ర ప్రభుత్వం లక్షా 50 వేల కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులను దారిమళ్లించిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్టకోసం కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో అన్ని పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రాలలో జనవరిలో నిర్వహించనున్న బహిరంగ సభలలో ప్రధాని మోదీ పాల్గొననున్నారని, అదేసమయంలో పార్టీ దేశాధ్యక్షుడు అమిత్‌షా పర్యటనలు జరుపనున్నట్లు తెలిపారు. సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, నల్లగొండ జిల్లాలలోని అన్ని నియోజకవర్గాలలో క్షేత్రస్థాయిలో పర్యటించి అన్నివర్గాలతో సమీక్షా సమావేశాలు నిర్వహించి పార్టీ బలాలను అంచనా వేస్తూ రానున్న 2019 ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నామన్నారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు 23 వేల బూత్ కమిటీలను నియమించినట్లు తెలిపారు. శక్తికేంద్రాలు, ఫుల్‌టైం వర్కర్లను నియమించి పూర్తిస్థాయిలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరుబాట చేపట్టనున్నట్లు తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఎంఐఎం ఎజెండాను అమలు చే స్తూ రజాకార్ల పాలనను కొనసాగిస్తున్నదని డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు. టీఆర్‌ఎస్ ఎన్నికల హామీల వైఫల్యాలే భారతీయ జనతా పార్టీ బలపడేందుకు దోహదపతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబపాలనలో రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందన్నారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ కలిసి పాలన కొనసాగించిన సంగతి ప్రజలు మరువలేదన్నారు. అంతర్గత కుమ్ములాటలతో మునిగిపోతున్న కాంగ్రెస్ పార్టీ టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేయలేకపోతోందన్నారు. పార్టీ మారి టీఆర్‌ఎస్‌లో చేరిన వారికి ఉపాధి కల్పించడంపైనున్న శ్రద్ధ రైతులు, దలితులు, నిరుద్యోగులపై లేకపోవడంతో టీఆర్‌ఎస్ మూడున్నర సంవత్సరాల పాలనలో రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు మనోహర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, కర్నాటి ధనుంజయ్య, పీవీ శ్యాంసుందర్‌రావ్ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..మీడియాతో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్