కృష్ణ

జంక్షన్‌లో వామపక్షాల బంద్ పాక్షికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హనుమాన్ జంక్షన్, డిసెంబరు 12: హనుమాన్ జంక్షన్ సమీపంలోని డెల్టా సుగర్స్‌ను మూసివేయడాన్ని నిరసిస్తూ వామపక్షాలు చేపట్టిన హనుమాన్ జంక్షన్ బంద్ పాక్షికంగా జరిగింది. అఖిలపక్షాల కార్యచరణ కమిటీ పిలుపుమేరకు చేపట్టిన జంక్షన్ బంద్‌లో సీపీఎం మినహా మిగిలిన పార్టీలు పెద్దగా అసక్తి చూపకపోవడం, పోలీసుల ముందస్తు అరెస్టుల నేపథ్యంలో మధ్యాహ్నానికే బంద్ ముగిసింది. బంద్ పాటించాలని కోరుతూ తెరిచివున్నా దుకాణాలను మూయించివేస్తున్న కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో సీపీఎం నాయకులు కేశవరావు, నరసింహారావు, రఘు, అబ్ధుల్ బారీ, బేతాళ శ్రీనివాసరావు, ముఠా కార్మికులు ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. అనంతరం హనుమాన్ జంక్షన్ కూడలిలో జాతీయ రహదారిపై ధర్నాకు ప్రయత్నించారు. దీనితో నేతలను పోలీసులు అరెస్టు చేసి వీరవల్లి, ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్లకు తరలించారు. అరెస్టు చేసిన నేతల్ని, కార్యకర్తలను సాయంత్రం 3గంటల వరకు విడిచిపెట్టలేదు. రైతులు, కార్మికుల ప్రయోజనాల కోసం పోరాటం చేస్తున్న సీపీఎం నేతల్ని, కార్యకర్తలను, కార్మికులను అరెస్టు చేయడం దారుణమని రైతు సంఘం నాయకులు వై కేశవరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

నైపుణ్యంతో కూడిన విద్యను అభ్యసించాలి
* జయప్రకాష్ నారాయణ
కృత్తివెన్ను, డిసెంబర్ 12: జనం కోసం సురాజ్య యాత్ర కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని మాట్లం గ్రామానికి జాతీయ లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ మంగళవారం పర్యటించారు. మాట్లం ఉన్నత పాఠశాలను పరిశీలించారు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ ఉపాధి కావాలంటే నైపుణ్యంతో కూడిన విద్యను అభ్యసించాలన్నారు. రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ పాఠశాలలో కనీస సామర్ధ్యాలు లేవన్నారు. సైన్స్, సోషల్ సబ్జెక్టులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం గ్రామంలోని ప్రజలతో సమావేశమయ్యారు. లోక్‌సత్తా పార్టీకి మాట్లం గ్రామం వెన్నుముఖ అన్నారు. గ్రామంలో సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. తమ గ్రామానికి మంచినీటి సరఫరా లేదని ప్రజలు మొర పెట్టుకున్నారు. మంచినీటి సమస్యపై సీఎంతో మాట్లాడతానని జయప్రకాష్ హామీ ఇచ్చారు. అధికార పార్టీ నాయకుల ఆగడాలతో గ్రామాభివృద్ధికి ఆటంకం కలుగుతుందని సర్పంచ్ వెంకటలక్ష్మి తెలిపారు. అవినీతి నిర్మూలన అనే ఆశయంతో తాను రాజకీయాల్లోకి వచ్చానని, అధికార పార్టీ బడాబాబుల వల్ల తనను ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో లోక్‌సత్తా పెడన నియోజకవర్గ కన్వీనర్ ఏడుకొండలు, ఉభయ రాష్ట్రాల కన్వీనర్ బండారు రామ్మోహనరావు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బి బాబ్జి, ప్రధాన కార్యదర్శి కె బాల సుబ్రహ్మణ్యం, నజీర్, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.