కృష్ణ

భవిష్యత్తులో మంచినీటి సమస్య రానివ్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), డిసెంబర్ 14: భవిష్యత్తులో బందరు వాసులకు మంచినీటి సమస్య తలెత్తకుండా పట్టణ నలుమూలలా రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టినట్లు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్థానిక 28వ వార్డు గడ్డిబజారులో అమృత్ పథకం కింద రూ.1.28కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 500 కిలో లీటర్ల సామర్థ్యం గల రిజర్వాయర్ నిర్మాణ పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ అమృత పథకం కింద ఇప్పటికే 3, 5, 31, 42 వార్డుల్లో ఇప్పటికే రిజర్వాయర్ల నిర్మాణాలు చేపట్టామన్నారు. 2018 నాటికి రిజర్వాయర్ల నిర్మాణాలు పూర్తిచేసి పట్టణ ప్రజలకు మంచినీటి సమస్య తలెత్తకుండా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, వైస్ చైర్మన్ కాశీ విశ్వనాధం (చంటి), కమిషనర్ జస్వంతరావు, కౌన్సిలర్లు నారగాని ఆంజనేయ ప్రసాద్, కొట్టె వెంకట్రావ్, ఎఎంసీ చైర్మన్ చిలంకుర్తి తాతయ్య, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ వర్కింగ్ చైర్మన్ తలారి సోమశేఖర్, టీడీపీ నాయకులు గొర్రిపాటి గోపిచంద్, ఇలియాస్ పాషా, కుంచే దుర్గా ప్రసాద్, కాసాని భాగ్యారావు తదితరులు పాల్గొన్నారు.

ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వాల ధ్యేయం
* మంత్రి కామినేని శ్రీనివాస్
కలిదిండి, డిసెంబర్ 14: ప్రజల ఆరోగ్యమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ధ్యేయమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డా. కామినేని శ్రీనివాస్ అన్నారు. మండల పరిధిలోని కోరుకొల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకార మహోత్సవంలో గురువారం ఆయన పాల్గొన్నారు. చైర్మన్‌గా చెన్నంశెట్టి కోదండ రామయ్య, సభ్యులుగా నరహరిశెట్టి గంగరాజు, శెన్నంశెట్టి సోమేశ్వరరావుచే ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఆస్పత్రిలో వైద్య సిబ్బంది కొరత లేకుండా చూడాలని డెప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ శాస్ర్తీని అదేశించారు. కోరుకొల్లు హరిజనవాడకు ఆర్‌డబ్ల్యుఎస్ పథకం కింద రూ.75లక్షలు, కైకలూరు నుండి కోరుకొల్లు వరకు గల ఆర్‌అండ్‌బీ రోడ్డుకు నాబార్డ్ నిధులు రూ.6కోట్లు మంజూరయ్యాయన్నారు. కోరుకొల్లు నుంచి చైతన్యపురం మీదుగా మల్లంపూడి రోడ్డు నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ నిధులు రూ.3కోట్ల 90లక్షలు మంజూరయ్యాయన్నారు. కోరుకొల్లు నుండి ఆవకూరు వెళ్లే పెదలంక డ్రైనేజిపై నిర్మిస్తున్న వంతెనను ఈ వేసవి నాటికి పూర్తి చేయటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కైకలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి జయమంగళ వెంకట రమణ, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ్య, స్వచ్ఛాంద్ర ఎడ్యుకేటివ్ వైస్ చైర్మన్ డా. సీఎల్ వెంకట్రావ్, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, ఆర్‌ఎస్‌ఎస్ రాష్ట్ర నాయకుడు భరత్‌జీ, కలిదిండి ఎఎంసీ చైర్మన్ వల్లభనేని శ్రీనివాస చౌదరి, జెడ్పీటీసీ నున్నా రమాదేవి, వైస్ ఎంపీపీ చన్నంశెట్టి శ్రావణి, మండల బీజెపీ అధ్యక్షుడు గుర్రాల శ్రీరామమూర్తి, టీడీపీ మండల అధ్యక్షుడు పోకల జోగిరాజు, టీడీపీ, బీజెపీ నాయకులు పాల్గొన్నారు.