కృష్ణ

18 నుండి వినియోగదారుల వారోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్), డిసెంబర్ 16: కన్స్యూమర్ వాయిస్ ఆఫ్ కౌన్సిల్ (సివికాం) ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీ నుండి నిర్వహించనున్న జాతీయ వినియోగదారుల వారోత్సవాలను విజయవంతం చేయాలని కౌన్సిల్ అధ్యక్షుడు కరింశెట్టి కైలాసపతి తెలిపారు. ఇందుకు సంబంధించి శనివారం వినియోగదారుల దీపిక పుస్తకాన్ని ఆవిష్కరించారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా పౌర సరఫరాల శాఖ, సివికాం సంయుక్త ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వారం రోజుల పాటు విద్యా సంస్థల్లో వివిధ అంశాలపై వినియోగదారులను చైతన్యవంతుల్ని చేస్తూ అవగాహనా సదస్సులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే విద్యార్థులకు వ్యాస రచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి 24వతేదీన జరిగే ముగింపు సభలో బహుమతి ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లంకిశెట్టి బాలాజీ, సివికాం సంస్థ ప్రతినిధి కొత్తగుండు రమేష్, వేమూరి పూర్ణచంద్రరావు, దింటకుర్తి ప్రసాద్, మోహనరావు, గడ్డం రాజు, మహ్మద్ పీర్, రమణ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి హామీ కార్యాలయాన్ని తనిఖీచేసిన డెప్యూటి కమిషనర్ వరప్రసాద్

పెనుగంచిప్రోలు, డిసెంబర్ 16: మండల కేంద్రంలోని ఉపాధి హామీ కేంద్రాన్ని గ్రామీణ అభివృద్ధి డెప్యూటీ కమిషనర్ డి శివశంకర వరప్రసాద్ శనివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీ నుండి కృష్ణా, గుంటూరు జిల్లాలో కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక టీమ్ ద్వారా సామాజిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, అందుకు సంబంధించిన రికార్డులు మొత్తం సిద్ధం చేసుకోవాలన్నారు. పెనుగంచిప్రోలు మండలంలో గత ఏడాది 3కోట్ల 40లక్షలతో పనులు నిర్వహించడం జరిగిందని, వాటికి సంబంధించిన జాబితా కూడా సిద్ధం చేయాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.