రంగారెడ్డి

ప్రపంచంలో నెంబర్1గా భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, డిసెంబర్ 24: భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ప్రపంచ దేశాలలో భారత్ అగ్రరాజ్యంగా నిలిచిందని బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ అధ్యక్షుడు రాయ్‌విచార్ నేతమ్ తెలిపారు. మండల కేంద్రంలోని ఎస్‌వీఎస్ గార్టెన్‌లో రాష్ట గిరిజన మోర్చా అధ్యక్షుడు నానావత్ బిక్కునాధ నాయక్ అధ్యక్షతన రాష్ట్ర గిరిజన మోర్చా కార్యకర్తల విస్కృత స్థాయి సమావేశం ఆదివారం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కేంద్ర మాజీ మంత్రి, జాతీయ గిరిజన మోర్చా అధ్యక్షుడు రాయ్‌విచార్ నేతమ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే.లక్ష్మణ్, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్, ఎమ్మెల్సీ రాంచందర్ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొంపల్లి మోహన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాయ్‌విచార్ నేతమ్ మాట్లాడుతూ దేశ రాజకీయాలలో గిరిజనులు నిర్ణయాత్మక శక్తి కలిగి ఉన్నారని అన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా అనేకం ఉన్నట్లు తెలిపారు. గిరిజనుల సంక్షేమం కోసం అనేక రకాల పథకాలు చేపడుతామని చెప్పి ఆదివాసి, గిరిజనుల మధ్య పోట్లాటలు పెట్టి ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడే పరిస్థితికి తీసుకువచ్చిందని అన్నారు. కోటలు దాటిన ప్రభుత్వ హామీలు ఫలితాల దగ్గరికి వచ్చేసరికి గీటుకూడ దాటలేదని విమర్శించారు. ప్రజాస్వామ్య విధానాలను, విలువలను తుంగలో తొక్కి రాచరిక, నిరంకుశ పాలన సాగిస్తుందన్నారు. తెలంగాణ ప్రాంతంలోని తండాలను, గూడాలను గ్రామ పంచాయతీలుగా చేస్తామని ప్రగల్భాలు పలికిన కేసిఆర్ ఆచరణలో చేసింది ఏమిలేదన్నారు. గిరిజనులను పూర్తిగా విస్మరించిన తెలంగాణ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు నానావత్ బిక్కునాధ నాయక్ మాట్లాడుతూ తెలంగాణలోని ఆరు లక్షల మంది ఆదివాసీలు, గిరిజన కుటుంబాలకు మూడు ఎకరాల సాగు భూమిని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. గిరిజనులకు పెట్టుబడులు, రుణ సౌకర్యాలు కల్పించి ఆధునిక, సేంద్రీయ వ్యవసాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. అటవి ప్రాంతం, పట్టణాల్లో ఉన్న పేద ఆదివాసీ, గిరిజనులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లను వెంటనే నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్య మంత్రి కేసిఆర్.. గిరిజనుల పట్ల వివక్షత చూపుతున్నాడని, వెంటనే మానుకుని గిరిజనుల ఆర్థిక, సంక్షేమానికి కృషి చేయాలని అన్నారు. లేనిచో గిరిజనుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చ ప్రధాన కార్యదర్శి ఎన్.రవినాయక్, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు కే.వివేక్ నాయక్, అయా జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.

శిల్పారామంలో కనువిందు చేస్తున్న కళారూపాలు
గచ్చిబౌలి, డిసెంబర్ 24: శిల్పారామంలో నిర్వహిస్తున్న జాతీయ హస్తకళాప్రదర్శనలో కొలువు దీరిన కళారూపాలు కనువిందు చేస్తున్నాయి. ప్రభుత్వ క్రిస్మస్ సెలవులు ప్రకటించడంతో నగర వాసులు కుటుంబ సమేతంగా షాపింగ్‌కు శిల్పారామం తరలి వచ్చారు. శిల్పారామం సందర్శకులతో కిటకిటలాడింది. ఎటూ చూసిన జనమే. సందర్శకు అంచనాలకు మించి రావడంతో శిల్పారామం సెక్యూరిటీ సిబ్బందితో పాటు ట్రాఫిక్ పోలీసులు ఇబ్బంది పడ్డారు.