నల్గొండ

పేద ప్రజలకు అండ ఎర్ర జెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ రూరల్, డిసెంబర్ 26: 92 ఏళ్ల నుండి సీపీఐ పలు ఉద్యమాల్లో పాల్పంచుకుంటూ పేద ప్రజలకు అండగా ఉందని సీపీఐ జిల్లా కార్యదర్శి పల్లా నర్సింహారెడ్డి అన్నారు. మంగళవారం సీపీఐ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కార్యాలయంలో జెండాను ఎగురవేసి మాట్లాడారు. బ్రిటీష్ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం ద్వారా ఆవిర్భవించిన పార్టీ సీపీఐ అని, దేశ స్వాతంత్య్ర పోరాటంలో వలసవాదులను తరిమికొట్టిందన్నారు. అదే విధంగా హైద్రాబాద్ సంస్థానంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సాగించిందన్నారు. అనంతరం సీపీఐ రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయకరణ కోసం పోరాడి దేశంలోనే రైతాంగానికి బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం అందేలా కృషి చేసిన ఘనత సీపీఐదేనన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సీపీఐ ముందుండి పోరాడిందన్నారు. అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల హామీలను అమలుచేయాలని, లేకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కలకొండ కాంతయ్య, పల్లా దేవేందర్‌రెడ్డి, పబ్బు వీరస్వామి, విశ్వనాథుల లెనిన్‌బాబు, సోమయ్య, కెయస్.రెడ్డి, ప్రద్యుమ్నారెడ్డి, బరిగెల వెంకటేశ్, జమీర్, సాగర్, యూసుఫ్, వెంకటేశం, పాండరయ్య, సురేందర్, సత్యనారాయణ, రవి, ఆర్షద్, స్వామి, పద్మ, రాజు, కుమార్, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.

భూదాన భూములు రైతులకే..
* భూదాన్‌బోర్డు బోర్డు చైర్మెన్ రాజేందర్‌రెడ్డి
బీబీనగర్, డిసెంబర్ 26: మండలంలోని రంగాపురం గ్రామంలో అన్యాక్రాంతమైన భూదాన్ భూములు రైతులకే చెందుతాయని భూదాన్‌బోర్డు చైర్మన్ రాజేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం రంగాపురం గ్రామంలో రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత 9 ఏళ్లుగా భూదాన భూములపై ఎనలేని పోరాటాలు చేస్తున్నామన్నారు. కింది, పైస్థాయి కోర్టులోనే రైతుల పక్షాన వచ్చిందని ప్రస్తుతం హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉందని తెలిపారు. హైకోర్టు తీర్పు అనంతరం నిమ్స్‌లో భూమి కోల్పోయిన రైతులకు నష్టపరిహారం, జాతీయ రహదారిలో భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. అదే విధంగా భూములు కోల్పోయిన రైతులకు కూడా భూములు ఇప్పిచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని అందుకు రైతులు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో సామాజికవేత్త రావుల అంజయ్య, రైతులు రామయ్య, బాల్‌రెడ్డి, చందుపట్ల నర్సింహ తదితరులు పాల్గొన్నారు.