తెలంగాణ

నత్తనడకన మల్లన్నసాగర్ భూ సేకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, డిసెంబర్ 27: ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ భూ సేకరణ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి అధికారులు ఇంకా మల్లగుల్లాలు పడుతూనే ఉన్నారు. 51 టీఎంసీల నీటి సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించడానికి అధికారులు ప్రణాళికలు రూపొందించిన విషయం విదితమే. సిద్దిపేట జిల్లా తొగుట, కొండపాక మండలాల పరిధిలోని ఐదు రెవెన్యూ గ్రామాల పరిధిలో రిజర్వాయర్‌ను నిర్మించడానికి అధికారులు వ్యూహాన్ని సిద్ధం చేసారు. ఇందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో భూ సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించగా అధిలోనే హంసపాదు ఎదురైన విషయం తెలిసిందే. భూ సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ముందుగా ఏటిగడ్డ కిష్టాపూర్‌కు వెళ్లిన రెవెన్యూ అధికారులను రైతులు అడ్డుకోవడంతో గొడవ తారస్థాయికి చేరుకుంది. పోలీసుల లాఠీ చార్జీలు, అన్ని పార్టీలు, రైతు సంఘాలు, చివరకు తెలంగాణ జేఏసీ సైతం రైతులకు బాసటగా నిలువడంతో పోరాటం తారాస్థాయికి చేరుకుంది. చివరకు గాల్లోకి కాల్పుల సంఘటన వరకు దారితీసిన విషయం తెలిసిందే. భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావుతో పాటు చివరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రంగంలోకి దిగి నిర్వాసితులకు నచ్చేజెప్పే ప్రయత్నం చేసినా నేటికీ ఉద్యమం కొనసాగుతూనే ఉంది. అక్టోబర్ 21వన అధికారులు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో వేములగాట్ గ్రామస్తులు ప్రశ్నల వర్షం కురిపించారు. గ్రామస్తులు అడిగిన అన్ని ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలను తెలుగులో లిఖిత పూర్వంగా సమర్పించాలని కోరారు. వేములగాట్ ప్రజల అభ్యంతరాలకు అధికారులు నుండి ఇప్పటి వరకు స్పష్టమైన సమాధాలు రాలేదు. కాగా బుధవారం నాడు తాజాగా అధికారులు గ్రామానికి విచారణకు రాగా గ్రామస్తులు మూకుమ్మడిగా బహిష్కరించారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అధికారులు చట్టాన్ని ఉల్లంఘిస్తూ తప్పుదారి పట్టిస్తున్నారని గ్రామస్తులు అధికారుల తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేసారు. 16, 17, 18 సెక్షన్లపై స్పష్టత ఇవ్వకుండానే విచారణ పేరుతో రావడం, నెల రోజుల ముందు నోటీసులు ఇవ్వాల్సి ఉండగా కేవలం ఒక రోజు ముందు పత్రికా ప్రకటన ద్వారా గ్రామానికి విచారణకు వస్తున్నామని అధికారులు తెలియజేయడాన్ని ప్రజలు తీవ్రంగా తప్పుపట్టారు. తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా తమ గ్రామ పరిధిలో రెండు సీజన్లలో పంటలను పండించుకున్నామని, ఎలాంటి ఇబ్బందులు లేని తమను నిర్వాసితులుగా మార్చవద్దని ప్లెక్సీల ద్వారా అధికారుల ముందు నిరసన వ్యక్తం చేసారు. భూ సేకరణ ప్రత్యేక అధికారి, సిద్దిపేట ఆర్డీవో ముత్యంరెడ్డిని గ్రామస్తులు ఇబ్బందికరమైన ప్రశ్నలు వేసారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణంలో ముంపునకు గురవుతున్న గ్రామాల్లో ఒక్క వేములగాట్ ప్రజలు మాత్రమే అంగీకరించడం లేదు. మిగిలిన గ్రామాల్లో దాదాపుగా భూ సేకరణ పూర్తి కావస్తున్నా వేములగాట్‌ను మాత్రం అధికారుల అధిగమించలేకపోతున్నారు. పరిహారం పెంచాలనో ఇతరత్ర సదుపాయాలు కల్పించాలనో డిమాండ్ చేయకుండా తమకు ప్రాజెక్టు ఎంతమాత్రం వద్దని, తరతరాలుగా జీవనం సాగిస్తున్న ఈ గ్రామాన్ని వదిలేది లేదని పిల్లలు మొదలుకుని పండు వృద్ధుల వరకు ఒకే డిమాండ్ చేస్తుండటంతో సమస్యను పరిష్కరించుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమవుతుందని చెప్పవచ్చు. మరోవైపు ములుగు మండలంలో నిర్మించతలపెట్టిన కొండ పోచమ్మ రిజర్వాయర్ భూ సేకరణ దాదాపు పూర్తికాగా, రిజర్వాయర్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
వేములగాట్ రైతులు హైకోర్టును ఆశ్రయించడం, 123 జీవోను రద్దు చేయడం, ప్రభుత్వం కొత్త జీవోలు జారీ చేయడం, ముఖ్యమంత్రి కల్పించుకుని పరిహారం పెంచుతామని చెప్పినా రైతులు మాత్రం భీష్మించుకుని కూర్చుంటున్నారు. 2019 నాటికి మల్లన్న సాగర్, కొండ పోచమ్మ రిజర్వాయర్ల నిర్మాణాలను పూర్తి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి వేములగాట్ ప్రజలు అడుగడుగునా మొకాలడ్డుతున్నారు. వేములగాట్‌లో ప్రజలు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించి బుధవారం నాటికి 571 రోజులు పూర్తి చేసుకున్నారు. కోటి ఎకరాల మాగాణికి సాగు నీరు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం ఇప్పట్లో సాధ్యమయ్యే పనికాదని విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు.