తెలంగాణ

పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 2: సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండ రామ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ప్రొఫెసర్ కోదండరామ్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం ప్రొఫెసర్ కోదండరామ్ మీడియాతో మాట్లాడతూ పాత పెన్షన్ విధానం కోసం చాలా ఉద్యోగులు ఉద్యమాలు చేస్తున్నారని తెలిపారు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో పని చేస్తున్న నాలుగవ తరగతి ఉద్యోగులను తెలంగాణకు తీసుకుని రావాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ అర్హతా పరీక్షకు 50 శాతం మార్కుల విధానాన్ని ఎత్తి వేయాలని, టెట్ రాసిన ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించాలని, టెట్ రాసిన ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. బహిరంగ మార్కెట్‌లో విద్యుత్తును ఎక్కువగా కొనుగోలు చేస్తున్నామని, అందుకే ఉత్పత్తి తగ్గిందన్నారు. రాష్ట్ర విద్యుత్తు విషయంలో గతంతో పోలిస్తే మార్పు ఏమీ లేదన్నారు. విద్యుత్తు కొనుగోలు పారదర్శకంగా జరగడం లేదని ఆయన విమర్శించారు. రానున్న రోజుల్లో విద్యుత్తు సంస్ధలు నష్టాల్లోకి వెళతాయని అన్నారు. 24 గంటల విద్యుత్తు వల్ల భూగర్బ జలాలు పడిపోతాయన్న ఆందోళన ప్రజలు ఉందని ఆయన తెలిపారు. సినీ నటుడు పవన్ కల్యాణ్, ముఖ్యమంత్రి కేసీఆర్ పరస్పరం తిట్టుకున్నారని, ఇప్పుడు కలుసుకున్నారని, వారిలో ఎవరికీ నిలకడ లేదని రేవంత్ అన్నారు.