తెలంగాణ

లియోనియో రిసార్ట్స్ చైర్మన్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 17: హైదరాబాద్ నగర శివారులోని శామీర్‌పేట వద్ద ఉన్న లియోనియో రిసార్ట్స్ చైర్మన్ చక్రవర్తి రాజును సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. పలు బ్యాంకుల్లో రూ.650 కోట్ల వరకు రుణాలు తీసుకుని తిరిగి చెల్లించలేదనే ఆరోపణలతో ఇప్పటికే బెంగుళూరు సిబిఐ అధికారులు కేసు నమోదు చేశారు. చక్రవర్తి రాజుతో పాటు పలువురు బ్యాంకు మేనేజర్లను ఈ కేసులో సిబిఐ నిందితులుగా చేర్చింది. ఈ కేసుల్లో భాగంగా చక్రవర్తి రాజను సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. తప్పుడు పత్రాలతో సుమారు 11 బ్యాంకు ల నుంచి రుణాలను భారీగా తీసుకోవడం, తిరిగి చెల్లించకపోవడంతో కేసు నమోదు చేశారు. అంతేకాకుండా 30 ఎకరాల విస్తీర్ణం ఉన్న రిసార్ట్స్‌ను వంద ఎకరాలకు పైగా ఉన్నట్లు పత్రాలు సృష్టించి బ్యాంకులను మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన కొన్ని కీలక డాక్యుమెంట్లను రిసార్ట్స్ కార్యాలయం నుంచి సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
నిర్మాత కళ్యాణ్ కార్యాలయంలో ఐటీ సోదాలు
నగరంలోని జై సింహా చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ కార్యాలయంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం సోదా లు జరిపారు. టిడిఎస్ పన్ను చెల్లించనందుకు ఆదాయ వ్యయాలకు సంబంధించిన లెక్కలను పరిశీలించారు. కృష్ణానగర్‌లోని ఆయన కార్యాలయంలో ఆరుగురు సభ్యు ల ఐటి బృందం సోదాలు నిర్వహించింది. కాగా తెలుగు చలన చిత్ర రంగంలో కొంద రు నిర్మాతలు గత మూడేళ్లగా టిడిఎస్ చెల్లించడం లేదని సమాచారం రావడంతో ఐటి అధికారులు నోటీసులు జారీ చేసి ఈ తనిఖీలు నిర్వహించారు. ఇంకా పలువురు నిర్మాతలు, నిర్మాణ సంస్థల నివాసాలు, కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించా రు. ఆదాయ వ్యయాల వివరాలు, టిడిఎస్ చెల్లించని కారణాలకు సంబంధించిన వివరాలతో దరఖాస్తు చేయాలని ఆదేశించారు.