తెలంగాణ
ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 21 January 2018
హైదరాబాద్, జనవరి 20: సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావును ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాశారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ హామీ అమలుకు నోచుకోలేదని ఆయన తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం, అదేవిధంగా కనీస వేతనం రూ.16 వేలు ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం చొరవ చూపాలని ఆయన కోరారు.