Others

సాయి పాదానంద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పువ్వు పుట్టగానే పరమళించినట్టు 1906లో ఏప్రిల్ 15 వెంకట్రామయ్యర్, లక్ష్మి అమ్మాళ్ గార్లకు పుత్రోత్సాహాన్ని సాయి పాదానంద రాధాకృష్ణగా పుత్రోత్సాహాన్ని కలిగించాడు. ఆ రాధాకృష్ణ బాల్యంలోనే వారి తల్లిదండ్రల భక్తివారసత్వాన్ని అందుకున్నారు. ఇతని తాతగారికి కొన్ని సిద్ధులుండేవని వీరు చెప్పేవారు.
ఒకసారి రాధాకృష్ణ తాతగారు నాగుపాము నోటిలోని ఇరుక్కున్న ముల్లును తీసివేశారట. ఆ ఉపకారం పొందిన నాగుపాము వీరి వంశాన్ని మూడు తరాల వరకు కాపాడుతానని సంకేతాన్ని ఇచ్చిందని వీరి తాతగారు వీరికి చెప్పారట. వీరు ఒకసారి చిన్నప్పుడు ఆడుకుంటుండగా దేవుని గదిలో ఏదో చప్పుడు వస్తే చూడడానికి వెళ్లాడట. అక్కడ ఓ ముప్పది సంవత్సరాల యువతి వచ్చి కూర్చుని ఉందట. ఈ రాధాకృష్ణను దగ్గరకు పిలిచి కాసేపు ఆడించివెళ్లిందట. ఇది నా చిన్ననాటి మరిచిపోలేని అనుభవమని సాయి పాదానంద చెప్పేవారు. వీరు పెరిగి పెద్దవారై ఉద్యోగస్థులుగా ఊటీలో ఉన్నప్పుడు వీరికి నారాయణ మహారాజ్ అనేవారు దత్తాత్రేయ మంత్రం ఉపదేశించారట. అప్పటి నుంచి రాధాకృష్ణ నృత్యం పట్ల ఆకర్షితులైనారట. వారు మంత్రోచ్చారణలోనే నృత్యం చేస్తుండేవారట. సాయిసమాజ్ లో భాగవత సమ్మేళనం జరుగుతుండగా రాధాకృష్ణ స్వామి నామోచ్చారణలో ఆనందపరవశులై నృత్యం చేశారట.
ఒకసారి శ్రీ బి.వి. నరసింహస్వామి వారు రాధాకృష్ణకు దర్శనం ఇచ్చారట. ఆ స్వామితో మాట్లాడుతూ ‘స్వామీ నాకు ఈ రాధాకృష్ణ అన్న పేరు ఎందుకు స్థిరపడుతుందో చెప్పండి’అని అడిగారట.
ఆ నరసింహస్వామి మరోసారి దీనికర్థం నీకు తెలుస్తుంది అనిచెప్పారట. వీరి కలలో సాయి మహారాజ్ కనిపించి 10వ అధ్యాయం చదువు అని ఆదేశించారట. వీరు మేల్గాంచిన భాగవతంలోని పదవ అధ్యాయం అనుకొని దాన్ని పారాయణ చేశారట. మళ్లీ ఈ నరసింహాస్వామి కనిపించి కాదు భగవద్గీతలోని 10 అధ్యాయం అని చెప్పారట. అలా నరసింహస్వామికి దగ్గర శిష్యులైన వీరు సాయి పాదానందగాసన్యాస నామం తీసుకొని పారమార్థిక సేవలో తరిస్తూ 1980 జనవరి 14న శివైక్యం చెందారు.

-ఆర్. శ్రీరాములు